Jio Rs 209 Plan: జియో యూజర్స్‌కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?

Jio Rs 209

Jio Rs 209

Jio Rs 209 Plan: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాకిచ్చింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందించే తన రూ.209 రీఛార్జ్ ప్లాన్‌ను సైలెంట్‌గా తొలగించింది. ఇప్పటివరకు మైజియో (MyJio) యాప్‌లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు కనిపించడం లేదు.

ట్రాయ్ ఆదేశాలే కారణమా..
టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఆదేశాల మేరకే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్లాన్ల వివరాల్లో పారదర్శకత లోపించిన కొన్ని ప్లాన్‌లను నిలిపివేయాలని ట్రాయ్ సూచించడంతో, జియో ఈ చౌక ప్లాన్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించినట్లు సమాచారం.

రూ.209 ప్లాన్ ప్రయోజనాలు ఇవే..
ఈ ప్లాన్ ద్వారా యూజర్స్ పొందిన బెనిఫిట్స్ ఒకసారి చూస్తే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులు ఉండేది. రోజుకు 1GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా, దేశవ్యాప్తంగా ఏదైనా నెట్‌వర్క్‌కు అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉండేది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ (SMS) చేసే సౌలభ్యం కూడా ఉండేది. దీనికి అదనపు ప్రయోజనాలుగా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ (JioAI Cloud) వంటి సేవలకు ఉచిత యాక్సెస్ ఉండేది. తక్కువ బడ్జెట్‌లో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో యూజ్‌పుల్‌గా పని చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ అందుబాటులో లేకపోవడంతో, దీని స్థానంలో జియో ఏ ప్లాన్‌ను తీసుకువస్తుందో చూడాలి.