NTV Telugu Site icon

Reliance: రిలయన్స్‌కు ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000 జాబితాలో 45వ స్థానం

Reliance

Reliance

Reliance: ప్రపంచంలోని అతిపెద్ద 2000 పబ్లిక్‌ కంపెనీల జాబితాను అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ జాబితాలో భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌)కు స్థానం దక్కింది. ప్రపంచంలోని 2,000 అతిపెద్ద పబ్లిక్‌ కంపెనీల జాబితాలో ఆర్‌ఐఎల్‌కు 45వ స్థానం దక్కింది. అమెరికాకు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్‌ చేజ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా నంబర్‌ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది. 2011 తర్వాత జేపీ మోర్గాన్‌కు నం.1 స్థానం దక్కడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది సౌదీ అరామ్కో రెండో స్థానంలో ఉండగా, చైనా బ్యాంకింగ్‌ దిగ్గజాలైన ఐసీబీసీ, చైనా కన్‌స్ట్రక్షన్‌ బ్యాంక్‌, అగ్రికల్చర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వరుసగా 3, 4, 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి.

Read also: Nigeria Boat Capsizes: దారుణం..పడవ బోల్తా పడటంతో 103 మంది మృతి..

ఫోర్బ్స్ మ్యాగజైన్‌ పబ్లిక్‌ కంపెనీలకు చెందిన 20వ వార్షిక జాబితాను ప్రకటించింది. కంపెనీల వార్షిక విక్రయాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్‌ విలువ ఆధారంగా ఫోర్బ్స్ కంపెనీల జాబితాను రూపొందించింది. రిలయన్స్‌ ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000 జాబితాలో 45వ స్థానంలో ఉంది. జాబితాలో భారత్‌ నుంచి మొత్తం 55 కంపెనీలకు చోటు దక్కింది. గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న ఉన్న బెర్క్‌షైర్‌ హాత్‌వే ఈసారి ఏకంగా 338వ స్థానానికి దిజారింది. జాబితాలో
బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా 6వ స్థానం, గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ 7వ స్థానం, ఎక్సాన్‌ మొబిల్‌ 8వ స్థానం, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ 9వ స్థానం, యాపిల్‌ 10వ స్థానంలో ఉన్నాయి. టాప్‌ టెన్‌లో ఆరు అమెరికన్‌ కంపెనీలే ఉండటం గమనించదగ్గ విషయం.

Read also: Tamil Nadu: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి అరెస్ట్

గత ఏడాది 105వ స్థానంలో నిలిచిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ).. ఈ ఏడాది 77వ స్థానానికి ఎగబాకింది. హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌ 153 నుంచి 128వ స్థానానికి పుంజుకుంది. ఓఎన్‌జీసీ ర్యాంకింగ్‌ 232 నుంచి 226 స్థానానికి మెరుగుపడింది. ఐపీఓ ద్వారా స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ఎల్‌ఐసీకి తొలిసారిగా ఈ జాబితాలో చోటు లభించింది. కంపెనీకి 363 స్థానం దక్కింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ర్యాంకింగ్‌ 384 నుంచి 387వ స్థానానికి పడిపోయింది. యాక్సిస్‌ బ్యాంక్‌ 423, ఎన్‌టీపీసీ 433, ఎల్‌ అండ్‌ టీ 449, ఎయిర్‌టెల్‌ 478, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 502, ఐఓసీ 540, ఇన్ఫోసిస్‌ 554, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 586, కోల్‌ ఇండియా 591, టాటా స్టీల్‌ 592, హిందాల్కో 660, వేదాంత 687వ స్థానాల్లో ఉన్నాయి. గౌతమ్‌ అదానీకి చెందిన మూడు సంస్థలకు కూడా ఈ జాబితాలో చోటు లభించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1,062, అదానీ పవర్‌ 1,488, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ 1,598వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.