E Cheques: కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. త్వరలో ‘ఈ-చెక్కులు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, భద్రతను పెంచేందుకు ‘పేమెంట్స్ విజన్ 2028’ (Payments Vision 2028) పేరుతో ఒక కీలక రోడ్‌మ్యాప్‌ను విడుదల చేసింది. రాబోయే కాలంలో మనం డబ్బులు పంపే విధానంలో రానున్న మార్పులు, కొత్తగా రాబోయే టెక్నాలజీలు, వినియోగదారుల రక్షణ కోసం ఆర్బీఐ తీసుకోబోయే చర్యలను ఈ డాక్యుమెంట్లో వివరించింది.
ప్రస్తుతం మనం వాడుతున్న కాగితపు చెక్కులకు ఉన్న నమ్మకాన్ని, డిజిటల్ లావాదేవీలకు ఉన్న వేగాన్ని కలిపి ‘ఈ-చెక్కులను’ తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది. అంటే భౌతికంగా చెక్కులు రాసి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. డిజిటల్ రూపంలోనే సురక్షితంగా చెక్కులను జారీ చేసే విధానాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది.
Also Read
- PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
- Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
ఈ-కామర్స్ సైట్లపై నిఘా..
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు.. ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారా వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అందుకే, ఈ సంస్థలను కూడా ఆర్బీఐ తన ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనివల్ల వినియోగదారుల డేటా భద్రత, లావాదేవీల క్రమబద్ధత పెరుగుతుంది.
మోసాలు జరిగితే ‘ఉమ్మడి బాధ్యత’..
ఆన్లైన్ మోసాల వల్ల ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే, ఇప్పటివరకు బాధ్యత ఎవరిది అనే విషయంలో స్పష్టత తక్కువగా ఉండేది. దీనిని పరిష్కరించడానికి ఆర్బీఐ ‘షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్‌వర్క్’ను తీసుకురానుంది. దీని ప్రకారం.. డబ్బులు పంపిన బ్యాంకు, డబ్బులు అందుకున్న బ్యాంకు రెండూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకులు మరింత జాగ్రత్తగా ఉండటానికి.. మోసాలను అరికట్టడానికి దోహదపడుతుంది.
Also Read:Ground War On: ఇరాన్‌తో యుద్ధం.. 57,000 మంది అమెరికా సైనికుల మొహరింపు..
వినియోగదారులకు మరింత నియంత్రణ..
మనం డెబిట్/క్రెడిట్ కార్డులను ఎలాగైతే మనమే ఆన్ లేదా ఆఫ్ చేసుకోగలమో (Enable/Disable), భవిష్యత్తులో ఇతర డిజిటల్ పేమెంట్ మోడ్స్ (UPI వంటివి) పట్ల కూడా వినియోగదారులకు అటువంటి నియంత్రణను ఇవ్వాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అంటే మీకు అవసరం లేనప్పుడు కొన్ని రకాల చెల్లింపులను మీరే నిలిపివేసుకోవచ్చు.
ఇతర మార్పులు..
లావాదేవీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో స్పష్టంగా తెలుసుకోవడానికి ‘డొమెస్టిక్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్’ (DLEI) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. బ్యాంకింగ్ ఏతర పేమెంట్ సంస్థల కోసం ‘సైబర్ కీ రిస్క్ ఇండికేటర్స్’ (KRI) ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నారు. ఆధార్ ద్వారా జరిగే చెల్లింపుల్లో మరిన్ని కొత్త సౌకర్యాలను (White-label solutions) తీసుకురానున్నారు. విదేశాలకు డబ్బు పంపడం లేదా అక్కడ నుంచి డబ్బులు అందుకోవడాన్ని మరింత సులభతరం చేసి, ఖర్చులను తగ్గించాలని ఆర్బీఐ నిర్ణయించింది.
మొత్తానికి.. ఆర్బీఐ ‘పేమెంట్స్ విజన్ 2028’ లక్ష్యం ఏమిటంటే.. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితంగా, పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండటం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వచ్చే సైబర్ ముప్పుల నుంచి సామాన్యుడిని రక్షించడమే ఈ కొత్త విధానాల ప్రధాన ఉద్దేశం.
తాజావార్తలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
-
Jawa 42 All Stars Edition: జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్ బైక్ లాంచ్.. 27.1hp పవర్, డ్యూయల్ ఛానల్ ABS, ధర ఎంతంటే?
-
AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
-
Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!