Site icon NTV Telugu

Ravi Narain-Bhagavad Gita: భగవద్గీత, కళ్లజోడు కావాలన్న రవి నరైన్. చిత్రా రామకృష్ణ సహా ఆ ముగ్గురికి 21 వరకు జ్యుడిషియల్ కస్టడీ

Ravi Narain Bhagavad Gita

Ravi Narain Bhagavad Gita

Ravi Narain-Bhagavad Gita: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్‌ చిత్రా రామకృష్ణ, మాజీ ఎండీ రవి నరైన్‌తోపాటు ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ పాండేలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఢిల్లీ కోర్టులో ఛార్జ్‌షీట్లు దాఖలుచేసింది. అనంతరం ఈ ముగ్గురి జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు ఈ నెల 21వ తేదీకి పొడిగించింది. ఇదిలా ఉండగా తనకు భగద్గీతతోపాటు మరో పుస్తకాన్ని, కళ్లజోడును అందించాలని రవి నరైన్‌ న్యాయస్థానానికి విజ్జప్తి చేశారు. మనీల్యాండరింగ్‌కి సంబంధించిన కేసులో ఈయన ఇటీవలే అరెస్టైన సంగతి తెలిసిందే. రవి నరైన్ పోలీస్ కస్టడీ ముగియటంతో ఆయన్ని నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు.

దేశ ప్రయోజనాల కోసమే..

దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతానికి ఇండో పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌లోని ట్రేడ్‌ పిల్లర్‌కి దూరంగా ఉండాలని ఇండియా నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ వివరించారు. డిజిటల్‌ ట్రేడ్‌కి సంబంధించిన చట్టపరమైన కసరత్తు జరుగుతోందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియా పర్యావరణం మరియు కార్మికుల ప్రయోజనాల కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండో పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌లో ట్రేడ్‌ పిల్లర్‌తోపాటు సప్లై చెయిన్స్‌, క్లీన్‌ ఎనర్జీ, ట్యాక్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ అనే మరో మూడు పిల్లర్లు కూడా ఉన్నాయి.

Telangana-Amazon Tie up: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అమేజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ టైఅప్‌

23 నెలల కనిష్టానికి

ఇండియా విదేశీ మారక నిల్వలు 23 నెలల కనిష్టానికి చేరాయి. ఈ నెల 2వ తేదీ నాటికి 7.9 బిలియన్ డాలర్లు తగ్గి 553 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. మన దేశ ఫారెక్స్‌ నిల్వలు 2020 అక్టోబర్‌ 9 తర్వాత ఎప్పుడూ ఇంతగా పడిపోలేదు. రూపాయి మారక విలువ మరింత తగ్గిపోకుండా కాపాడేందుకు ఆర్‌బీఐ.. డాలర్లను విక్రయించటం ఫారెక్స్‌ నిల్వలు తగ్గటానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన రూపాయి మారకం విలువ 80.13కి తగ్గిన సంగతి తెలిసిందే.

Exit mobile version