NTV Telugu Site icon

PM Modi: ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చింది

Pm Modi

Pm Modi

కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ కొలువుదీరాక స్టాక్ మార్కెట్‌కు కొత్త ఊపు సంతరించుకుంది. కొద్ది రోజులుగా సూచీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రెండు ప్రధాన సూచీలు జీవనకాల గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే అంశంపై బుధవారం రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగంలో ప్రస్తావించారు. ఎన్నికల ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్ల రేంజ్‌ను పెంచాయని తెలిపారు. ప్రపంచంలో కూడా కొత్త ఉత్సాహాన్ని సృష్టించాయని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 10వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు. భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Koo App Shutdown : మూతపడ్డ దేశీయ సోషల్‌ మీడియా ‘ కూ ‘ యాప్‌..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోడీ సభలో సమధానమిచ్చారు. దేశంలో ప్రజా రవాణాలో వేగవంతమైన పరివర్తన కనబడుతుందన్నారు. అలాగే మహిళా సాధికారత ప్రయోజనాలు అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నాయని మోడీ చెప్పుకొచ్చారు. స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది మహిళలు ‘లఖపతి దీదీలుగా’ మారారన్నారు. రాబోయే సంవత్సరాల్లో వారి సంఖ్య 3 కోట్లకు పెరుగుతుందన్నారు. వ్యవసాయం నుంచి మార్కెట్ వరకు సూక్ష్మ ప్రణాళికతో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసిందని ప్రధాని అన్నారు.

ఇది కూడా చదవండి: Hathras stampede: “భోలే బాబా” సెక్యూరిటీ నెట్టేయడంతోనే తొక్కిసలాట.. కీలక విషయాలు వెలుగులోకి..

ఇక బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ లాభాల్లో పరుగులు పెట్టింది. ఇక సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లకు దన్నుగా నిలిచియాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లోనే రెండు ప్రధాన సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకాయి. తొలిసారి సెన్సెక్స్‌ 80,000 కీలక మైలురాయిని తాకి 80,074 దగ్గర సరికొత్త రికార్డును నెలకొల్పింది. అలాగే నిఫ్టీ కూడీ 24,296 దగ్గర తాజా జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 545 పాయింట్లు లాభపడి 79, 986 దగ్గర ముగియగా.. నిఫ్టీ 162 పాయింట్లు లాభపడి 24, 286 దగ్గర ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.53 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Supritha: సాంప్రదాయనీ… ‘సుప్పి’నీ.. ఏంటిదీ?