రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan: పండుగల వేళ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) 24వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు పండగ కానుకగా ఈ మొత్తం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నేరుగా రూ.2,000 జమ చేసేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. అయితే చిన్న పొరపాటు జరిగినా లేదా కీలకమైన రూల్స్ పాటించకపోయినా ఈ సాయం నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.
గతంలో జూన్ 20న 23వ విడత సొమ్మును విడుదల చేశారు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకోసారి ఇచ్చే ఈ సాయం గడువు ముగియడంతో, 24వ విడతపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈ నెలలోనే అంటే అక్టోబర్‌లోనే డబ్బులు పడొచ్చని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నీలేష్ చౌరసియా సంకేతాలిచ్చారు. నవంబర్ 8న దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో, అంతకంటే ముందే రైతుల చేతికి నిధులు అందే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ ప్రచారాలను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచించారు.
Also Read
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
- Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
- Gold - Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
ఈ పనులు చేయకపోతే లిస్టులోంచి మీ పేరు ఔట్
చాలామంది రైతులు అర్హులైనప్పటికీ, చిన్నపాటి సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు పడక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మీ 24వ విడత డబ్బులు ఆగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు.
* దరఖాస్తు సమయంలో ఇచ్చిన వ్యక్తిగత వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి.
* ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
* భూమి రికార్డుల ధ్రువీకరణ (ల్యాండ్ సీడింగ్) పూర్తయి ఉండాలి.
* బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్, డీబీటీ (DBT) ఎనేబుల్ అయి ఉండటం అత్యంత ముఖ్యం.
ఇంట్లోనే ఉండి పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి:
మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. మొబైల్ ద్వారానే సులభంగా స్టేటస్ చూసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్సైట్ [https://pmkisan.gov.in/](https://pmkisan.gov.in/) ఓపెన్ చేయండి. తర్వాత హోమ్‌పేజీలోని ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్ నమోదు చేయండి. తర్వాత ‘Get OTP’ బటన్ నొక్కగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి. వెంటనే మీ దరఖాస్తు పరిస్థితి, డబ్బులు ఎందుకు ఆగాయి లేదా ఎప్పుడు పడతాయి అనే వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఈ జాగ్రత్తలు ముందే తీసుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా దీపావళి కానుకగా రూ.2,000 మీ ఖాతాలో జమ అవుతాయి.
తాజావార్తలు
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..