Site icon NTV Telugu

Petrol Prices: సామాన్యులకు షాక్ తప్పదా? భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు

గత కొన్నిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్ రేట్లు మరోసారి భారీగా పెరుగుతాయని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్‌పీ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా.. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు ధరలు పెంచడం లేదని తెలుస్తోంది.

Read Also: Bharti Airtel: వినియోగదారులకు మరో షాక్..!

దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల్లో ఎలాంటి మార్పు ఉండబోదని డెలాయిట్ ఇంఇయా ఎల్‌ఎల్‌పీ సంస్థ పార్ట్‌నర్ దేబాశిష్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మార్చి 10వ తేదీ తర్వాత లీటరుపై రూ.8-9 వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా పన్ను రూపంలో ప్రభుత్వం ఎంతో కొంత తగ్గిస్తుందని, మిగిలిన భారాన్ని ప్రజలే మోయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్రోల్ ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్నారు.

Exit mobile version