NTV Telugu Site icon

Petrol Prices: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్రం

Petrol Prices

Petrol Prices

Petrol Prices: దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్‌, డీజిల్‌పై చెరో 40 పైసలు తగ్గనున్నట్లు సోమవారం నాడు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో మరోసారి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.109.64, డీజిల్ రూ.97.8గా ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.67, డీజిల్ ధర రూ.99.40గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి. ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్‌ రూ.106.31, డీజిల్‌ ధర రూ.94.27గా నమోదైంది.

Read Also: Instagram Down: ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. యూజర్లకు ఇక్కట్లు

కాగా చమురు ధరల పెంపుపై ఉత్పత్తిదారులకు ఇంధన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ వార్నింగ్ ఇచ్చారు. అబుదాబీలో సోమవారం నాడు ఇంధన ఉత్పత్తిదారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంధన ధరల పెంపు వల్ల ఒరిగే లాభం ఏమీ ఉండదని.. ఇది ప్రపంచ సంక్షోభానికి దారి తీస్తుందని తెలిపారు. ఇంధన ధరలు పెంచితే వాటి వినియోగం తగ్గి పునరుత్పాదక శక్తికి డిమాండ్ పెరుగుతుందన్నారు. దాని వల్ల ఉత్పత్తిదారులకే నష్టమని స్పష్టం చేశారు. ధరల పెంపుతో పరిస్థితి మరింత దిగజారుతుందే తప్ప మెరుగవదని అభిప్రాయపడ్డారు.