Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Diesel Price Hike: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, హార్వర్డ్ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ హెచ్చరించారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చని, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని, రూపాయి విలువ కూడా పడిపోవచ్చని ఆమె స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చితే, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని గీతా గోపీనాథ్ తెలిపారు. ఈ ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడవచ్చని, దేశం ఇంధన ధరల పెరుగుదలతో పాటు ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చని ఆమె పేర్కొన్నారు.
చమురు నుంచి ఎరువుల వరకు ప్రభావం
ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన గీతా గోపీనాథ్, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ సరఫరా గొలుసును ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువుల సరఫరాపై కూడా ఈ సంక్షోభం ప్రభావం చూపుతోందన్నారు. ధరలు పెరగడమే కాకుండా, కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం ఇంధన అవసరాల కోసం మధ్యప్రాచ్య దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో, ఈ పరిస్థితి దేశానికి మరింత సవాలుగా మారుతుందని ఆమె తెలిపారు. ఇది కేవలం ధరల సమస్య మాత్రమే కాకుండా, సరఫరా అంతరాయాలకు కూడా దారితీసే ప్రమాదం ఉందని చెప్పారు.
Also Read
- Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
హార్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు పెరిగితే..
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ఒకవేళ సరఫరా అంతరాయాలు కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని గీతా గోపీనాథ్ హెచ్చరించారు. జూన్ వరకు ఇదే పరిస్థితి కొనసాగితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే అవకాశముందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ముడి చమురు ధరల పెరుగుదల భారతదేశంలో నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతుందని చెప్పారు.
పెట్రోల్-డీజిల్ ధరలు మరింత పెరగొచ్చు
ముడి చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తప్పదని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వం కొంత మేర ఆర్థిక లోటును భరించాల్సి రావచ్చని, అయితే దాని ప్రభావం ప్రజలు, కంపెనీలపై పడే అవకాశం ఉందన్నారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. రోజువారీ అవసరాల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.
రూపాయి విలువపై కూడా ఆందోళన
రూపాయి విలువ కూడా మరింత క్షీణించే ప్రమాదం ఉందని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే సుమారు 91 వద్ద ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 97 ప్రాంతానికి చేరుకుందని తెలిపారు. అయితే రూపాయి 100 మార్క్‌ను దాటుతుందా అనే అంశంపై అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉపాధి, ద్రవ్యోల్బణం, ఉత్పత్తి వంటి అంశాలపైనే ప్రధాన దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. ప్రస్తుతం పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలు బలంగా ఉన్నాయని, తీవ్రమైన ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు తక్కువేనని గీతా గోపీనాథ్ తెలిపారు.
తాజావార్తలు
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
-
Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్‌లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!