NTV Telugu Site icon

Petrol and Diesel Prices: ఎన్నికల ముందు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!

Petrol And Diesel

Petrol And Diesel

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనాదారులకు ఉపశమనం కలిగిస్తూ.. ఈ ఏడాది మే నెలలో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది కేంద్రం.. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది.. ఇది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామం.. అంతేకాదు.. త దీపావళి అనంతరం పెట్రో ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. అప్పట్లో కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్ పై రూ.10 చొప్పున తగ్గించింది. అంతుకు ముందు.. లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్ పై రూ.10 చొప్పున తగ్గించిన విషయం విదితమే.. అయితే, మరోసారి భారీగా పెట్రో ధరలు తగ్గుతాయనే చర్చ సాగుతోంది.. ఈ సారి పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2 వరకు తగ్గింపు ఉండవచ్చు అనే ప్రచారం సాగుతోంది..

Read Also: YS Jagan Mohan Reddy: టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలపై సీఎం జగన్‌ ఫోకస్‌

అయితే, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. భారత్‌లోనూ ఈ మధ్య పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకున్నది కూడా లేదు.. అయితే, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి.. ఈ నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరోసారి తగ్గించే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. ఈ నెల 1వ తేదీన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయనే ప్రచారం జరిగింది.. కానీ, అలాంటి నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు.. మరోవైపు, సోమవారం రాత్రి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. డీలర్లకు ధరల తగ్గింపుపై నోటిఫై చేసిందని, మళ్లీ మంగళవారం ఉదయం నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఇక, మంగళవారం, బుధవారం రోజుల్లో కూడా ఎలాంటి మార్పులు కనిపించలేదు.. కానీ, త్వరలోనే పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గుతాయనే ప్రచారం మాత్రం సాగుతోంది.. మరోవైపు.. కరోనా మహమ్మారి తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో.. క్రమంగా భారత్‌లో పెట్రోల్, డీజిల్ డిమాండ్ పెరిగిపోతోంది.. ఇదిలా ఉండగా, దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా కొనసాగుతోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27. చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94 కాగా, డీజిల్ ధర రూ.87.89గా ఉంది.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా ఉన్న విషయం విదితమే.

Show comments