Site icon NTV Telugu

Oil Price: కేంద్రం నిర్ణ‌యంతో దిగిరానున్న ఆయిల్ ధ‌ర‌లు…

కేంద్ర‌ప్ర‌భుత్వం దిగుమ‌తుల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ముడిపామాయిల్ దిగుమ‌తిపై సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబంధించి అగ్రిక‌ల్చ‌ర్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెస్‌ను త‌గ్గిస్తూ నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. అంతేకాదు, ఎడిబిల్ ఆయిల్‌పై బేసిక్ క‌స్ట‌మ్ డ్యూటీ త‌గ్గింపును ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30 వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఉన్న గ‌డువు మార్చి 31 వ తేదీతో ముగుస్తుండ‌గా, దీనిని సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగించింది. ఇక సెస్ త‌గ్గింపు, ముడిపామాయిల్ దిగుమ‌తి ప‌న్నుల మ‌ధ్య అంత‌రం పెరుగుతుంది.

Read: Russia-Ukraine: స‌రిహ‌ద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌… ఏ క్ష‌ణంలో అయినా…

దీంతో దేశంలోని రిఫైన‌ర్ల‌కు పామాయిల్ మ‌రింత చౌక‌గా దిగుమ‌తి కానున్న‌ది. దిగుమ‌తి సుంకం త‌గ్గింపు నిన్న‌టి నుంచే అమ‌లులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం దిగుమ‌తి ప‌న్ను గ్యాప్ 8.25 శాతం ఉంద‌ని, ఈ గ్యాప్ 11 శాతానికి పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, 11 శాతానికి పెంచితే దేశంలోని రిఫైన‌రీల‌కు మ‌రింత ప్రోత్సాహం ల‌భిస్తుంద‌ని ఎస్ఈఏ తెలియ‌జేసింది.

Exit mobile version