పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో క్రిఫ్టో కరెన్సీ, దాని అనుబంధ కరెన్సీలను పూర్తిగా బ్యాన్ చేయాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 100 మిలియన్ అమెరికన్ డాలర్ల డిజిటల్ కరెన్సీ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై సింధ్ హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసి క్రిఫ్టో కరెన్సీపై నిర్ణయం తీసుకోవాలని, వాటిపై నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ క్రిఫ్టో కరెన్సీపై కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేధిక ఆధారంగా బ్యాన్ చేసేందుకు సిద్ధం అవుతున్నది. దీనిపై ఏర్పాటు చేసిన ప్యానల్‌లో ఫైనాన్స్, ఇన్ఫర్‌మేషన్ శాఖ, టెక్నాలజీ అండ్ టెలీకమ్యూనికేషన్ శాఖ మంత్రులు సభ్యులుగా ఉన్నారు.
Read: సమంత- చైతన్య విడాకులపై మొదటిసారి నోరువిప్పిన నాగార్జున
ఈ ప్యానల్ దీనిపై ఇప్పటికే నివేదికను సిద్దం చేసింది. పాక్ చట్టాలు క్రిఫ్టో కరెన్సీకి అనుమతి ఇచ్చేవిధంగా లేవని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న కరెన్సీపై నిషేధం విధించాలని ప్యానల్ నివేదికలో పేర్కొన్నారని తెలస్తోంది. పాక్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పాక్‌లో ఈ క్రిఫ్టో కరెన్సీని, దాని అనుబంధ డిజిటల్ కరెన్సీలను పూర్తిగా బ్యాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే, పాక్‌లో క్రిఫ్టో కరెన్సీపై పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.