సమంత- చైతన్య విడాకులపై మొదటిసారి నోరువిప్పిన నాగార్జున

గత ఏడాది మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ విషయాలలో అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల వార్త ఒకటి. ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం సామ్ ట్రోలింగ్ బారిన పడడం.. ఆమె దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే విడాకుల తరువాత నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ సమంత గురించి, విడాకుల గురించి నోరు విప్పింది లేదు. కాగా, ఇటీవల చై మొదటిసారి తన డివోర్స్ గురించి మాట్లాడాడు. బంగార్రాజు ప్రమోషన్లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల విషయం చెప్పుకొచ్చాడు.. ” అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న డెసిషన్… ఆమె సంతోషంగా ఉంది… నేనూ సంతోషంగా ఉన్నాను… ఈ సిట్యుయేషన్ లో ఇది ఇద్దరికీ బెస్ట్ డెసిషన్” అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ విషయంపై తాజగా నాగార్జున కూడా స్పందించారు. ” ఆ సమయంలో నాగ చైతన్య ఎంత బ్యాలెన్సెడ్ గా ఉన్నాడో చూసి నేను గర్వపడుతున్నాను. అది జరిగాక ఒక్క మాట కూడా తను మాట్లాడలేదు.. తనను అలా చూసి అందరి తండ్రులులాగే నేను చాలా బాధపడ్డాను. ఆందోళన పడ్డాను. కానీ, చై మాత్రం నాన్న.. మీరు ఓకేనా అని అడిగేవాడు.. అదేంటిరా నేను కదా అడగాల్సింది అనుకునేవాడిని. ఏదేమైనా విడాకులు తీసుకోవడం వారి వ్యక్తిగత విషయం. ఇద్దరు హ్యాపీగా ఉంటే అదే చాలు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఇన్ని రోజుల తరువాతైనా ఈ తండ్రీకొడుకులు ఓపెన్ అవ్వడం అభిమానులకు ఆనందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles