కరోనా కారణంగా సెమీకండక్టర్ల దిగుమతి తగ్గిపోయింది. కార్ల తయారీలో సెమీకండక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా కార్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయినట్టు కేంద్ర ఆర్థికశాఖ సర్వే తెలియజేసింది. సెమీకండక్టర్ల కొరత కారణంగా 2021 డిసెంబర్ నాటికి సుమారు 7 లక్షల కార్లను అనుకున్న సమయానికి కార్లకంపెనీలు డెలివరీ చేయలేకపోయాయని కేంద్రం తెలియజేసింది. 2021లో వాహనాల డెలివరీ సమయం 14 వారాలకు చేరిందని కేంద్ర ఆర్థిక సర్వేలో పేర్కొన్నది. 2021 డిసెంబర్ నెలలో 2,19,421 ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్టు కేంద్రం తెలియజేసింది.
Read: ప్రపంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు ఎన్నున్నాయో తెలుసా?
అయితే, 2020 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 13 శాతం తక్కువ అని పేర్కొన్నది. సెమీకండక్టర్ల కొరతను నివారించేందుకు దేశీయంగా సెమీకండక్టర్ల తయారినీ ప్రోత్సహించేందుకు కేంద్రం రూ. 76,000 కోట్ల రూపాయలను కేటాయించినట్టు ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. త్వరలోనే ఈ కొరత నివారణ జరుగుతుందని, తిరిగి కార్ల తయారీ రంగం, అమ్మకాలు పెరుగుతాయని కేంద్రం ఆర్థిక సర్వేలో తెలియజేసింది.
