Site icon NTV Telugu

Layoffs: ఒక్క ఏప్రిల్ నెలలోనే 20,000 మంది ఉద్యోగుల్ని తొలగించిన టెక్ కంపెనీలు..

Google Layoff

Google Layoff

Layoffs: ఏడాదిన్న కాలంగా పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేస్తూనే ఉన్నాయి. ఈ లేఆఫ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక పురోగతిలో అస్థిరత కారణంగా పలు కంపెనీలు వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20,000 కన్నా ఎక్కువ మంది ఉద్యోగుల్ని టెక్ కంపెనీలు తీసేశాయి. layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం, సాంకేతిక రంగంలోని 50 కంపెనీల నుండి 21,473 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి.

Read Also: Karnataka Sex Scandal: సెక్స్ వీడియో కేసులో ముందస్తు బెయిల్ కోసం హెచ్‌డీ రేవణ్ణ పిటిషన్..

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని తలకిందులుగా చేయడం ఈ ఉద్యోగులు తొలగింపు జరుగుతూనే ఉంది. 2024లో కూడా పలు కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ ఏడాది కనీసం 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగాలను నుంచి తీసేశాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి, ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 తొలగింపులతో సహా మార్చిలో 37 కంపెనీలు 7,403 ఉద్యోగులను విడిచిపెట్టింది. మార్చి నెలలో ఉద్యోగుల తొలగింపు స్వల్పంగా తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఏప్రిల్ నెలలో పెరిగింది.

ఆపిల్ ఇటీవల తన 614 మంది ఉద్యోగుల్ని తొలగించింది. గూగుల్ వివిధ టీముల్లో ఉద్యోగుల్ని తొలగించింది. అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది మందిని తగ్గించింది. ఇంటెల్ 62 మంది, బైజూస్ 500 మంది ఉద్యోగుల్ని తీసేసింది. టెస్లా ఎలక్ట్రిక్ మోటార్ కంపెనీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్ని వదులుకోవాల్సి వచ్చింది. ఓలా క్యాబ్స్ 200 మందిని, హెల్తీఫై 150 మందిని, వర్ల్‌పూల్ 1000 మందిని, టేక్ టూ ఇంటరాక్ట్ 5 శాతం మంది, టెలినార్ 100 మంది ఉద్యోగులను తీసేశాయి.

Exit mobile version