NTV Telugu Site icon

OYO: పెళ్లికాని జంటలకు ఓయో బిగ్ షాక్.. కొత్త రూల్స్తో వారికి చెక్

Oyo

Oyo

OYO: ప్రముఖ హోటల్‌ అగ్రిగేటర్‌ ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఓయో రూపొందించిన పాలసీ ప్రకారం.. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వరు.. కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ ఆధారంగా.. ఇకపై ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లోనైనా రూమ్స్ బుకింగ్‌ సమయంలో అన్ని జంటలు పెళ్లి చెసుకున్నట్లు రుజువును చూపించాల్సి ఉంటుంది.. అంటే కచ్చితంగా పెళ్లిని నిర్ధరించే ఐడీ ప్రూఫ్ చూపించాలి.. లేకపోతే, పెళ్లికానీ వారి బుకింగ్‌లను తిరస్కరించే విచక్షణాధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లకు ఇచ్చింది. ఇక, మేరఠ్‌లోని తన భాగస్వామ్య హోటళ్లలో తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురావాలని ఓయో నిర్ణయించుకుంది. గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Read Also: K Laxman: కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం.. బీజేపీ ఎంపీ ఫైర్

కాగా, ఓయో సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను అమలు చేసేందుకు కట్టుబడి ఉందని ఓయో నార్త్ ఇండియా రీజియన్‌ హెడ్‌ పవాస్‌ శర్మ వెల్లడించారు. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణం చేసేవారికి సురక్షితమైన వసతులు అందించే బ్రాండ్‌గా నిలవాలని తాము భావిస్తున్నాం.. అందులో భాగంగానే తాజాగా కొత్త చెక్ -ఇన్‌ పాలసీని తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. కస్టమర్ల విశ్వాసం పెరిగి, బుకింగ్లు పెరిగేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే, వ్యాలిడ్‌ ప్రూఫ్‌గా ఏయే పత్రాలు చూపించాలనేదానిపై ఇప్పటి వరకు ఓయో స్పష్టత ఇవ్వలేదు.

Show comments