NTV Telugu Site icon

Nirmala Sitharaman: రానున్న ఐదేళ్లలో సామాన్యుల జీవితాల్లో మార్పులు తీసుకొస్తాం

Nirmalasitharaman

Nirmalasitharaman

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల కారణంగా సామాన్యుల జీవన ప్రమాణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్‌ సదస్సుల్లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు.. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో తలసరి ఆదాయం రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అసమానతలు తగ్గడంతో పాటు గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Bhupathi Raju Srinivasa Varma: సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన బీజేపీ.. అంతా వారి వల్లే..!

తలసరి ఆదాయం 2,730 డాలర్లకు చేరేందుకు మనకు 75 సంవత్సరాలు పట్టిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో 2,000 డాలర్లును 5 ఏళ్లలో చేరుకోగలిగినట్లు తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ నిలవనుందని స్పష్టం చేశారు. రానున్న దశాబ్దంలో జీవన ప్రమాణాలు బాగా పెరగనున్నాయని అంచనా వేశారు. అందుకు గత పదేళ్లలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణమని వివరించారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ కొన్నేళ్ల కనిష్ఠానికి చేరిందన్నారు. ప్రస్తుతం బ్యాంకుల దగ్గర సమర్థవంతమైన రుణ రికవరీ విధానాలు ఉన్నాయని ఆమె తెలియజేశారు.

ఇది కూడా చదవండి: TPCC Chief Mahesh Goud: మోడీ దేవుళ్ళ పేరుతో రాజకీయం, ఓట్ల బిక్షాటన చేస్తున్నారు..

కౌటిల్య ఆర్థిక సదస్సు మూడో ఎడిసిన్ అక్టోబర్ 4 నుంచి 6 వరకు జరగనుంది. ప్రాముఖ్యంగా ఈ సదస్సులో కాన్‌క్లేవ్ గ్రీన్ ట్రాన్సిషన్, జియో-ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్, అభివద్ధికి సంబంధించిన చిక్కులు, విధానపరమైన చర్యలు, సూత్రాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్ హోటల్‌లో కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్ సదస్సు జరుగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వక్తులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కౌటిల్య ఆర్థిక సదస్సును ఆర్థిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ నిర్వహిస్తోంది.

Show comments