NTV Telugu Site icon

Stock market: మళ్లీ ఒడిదుడుకులు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌లో మళ్లీ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఒక్కొక్క రోజు ఒక్కోలా మార్కెట్ నడుస్తోంది. గురువారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. శుక్రవారం మాత్రం ఫ్లాట్‌గా ప్రారంభమై నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టపోయి 81, 381 దగ్గర ముగియగా.. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 24, 964 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.97 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Noel Tata: టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నోయల్ టాటా.. ఎవరితను..?

నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఎం అండ్ ఎం, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, పవర్ గ్రిడ్ కార్ప్ ఉండగా.. ట్రెంట్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఒఎన్‌జీసీ లాభపడ్డాయి. రంగాలవారీగా ఆటో, బ్యాంక్, పవర్, రియల్టీ 0.5 శాతం చొప్పున క్షీణించగా, ఐటీ, మెటల్, ఫార్మా, మీడియా -.5-1 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి.

ఇది కూడా చదవండి: Viral Video: “అది కొండచిలువ.. బల్లిని కాదు గురూ..” బాల్కనీలో పాము కోసం వెతుకుతూ..