NTV Telugu Site icon

New Payment System: కొత్త పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్లాన్..

Rbi

Rbi

New Payment System: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) పేమెంట్ వ్యవస్థను తీసుకువచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలో ప్రజలు డిజిటల్ పేమెంట్ వ్యవస్థ వైపు వెల్లేందుకు యూపీఐ సహకరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్బీఐ మరో పేమెంట్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది రెగ్యులర్ పేమెంట్ వ్యవస్థలా కాకుండా అత్యవసర, అనుకోని పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ కొత్త పేమెంట్ సిస్టమ్ ఉపయోగపడేలా ఆర్బీఐ ప్లాన్ చేస్తోంది. సోమవారం ఆర్బీఐ తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని తెలియజేసింది. కొత్త చెల్లింపుల వ్యవస్థ అవసరాన్ని అందులో ప్రస్తావించింది.

Read Also: Maharashtra: 11 ఏళ్ల బాలికతో ఫేస్‌బుక్ ఫ్రెండ్షిప్.. కిడ్నాప్, ఏడాదిన్నరగా అత్యాచారం..

ప్రస్తుతం UPI, NEFT, RTGS వంటి పేమెంట్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. పెద్ద మొత్తంలో నగదు సులువుగా పంపేందుకు ఈ వ్యవస్థలు ఉపయోగపడుతున్నాయి. అయితే వీటికి నెట్ వర్క్, ఐటీ వంటి సదుపాయాలు తప్పనిసరిగా అవసరం. అనుకోకుండా సంభవించే ప్రకృతి విపత్తులు, యుద్ధం వంటి పరిణామాల సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై ప్రభావం పడే పలు సందర్భాల్లో పేమెంట్ సిస్టమ్ పై ప్రభావం పడుతుంది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొత్త పేమెంట్స్ వ్యవస్థ ఉపయోగిపడుతుందనేది ఆర్బీఐ ఆలోచన. ఇలాంటి సందర్బాల్లో పేమెంట్ చేయడానికి లైట్ వెయిట్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్(LPSS) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తోంది.

పరిమిత సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఉపయోగించి ఈ కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించాలని ఆర్బీఐ ప్లాన్. అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్ లో స్థిరత్వం తీసుకువచ్చేందుకు ఈ చెల్లింపుల వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆర్బీఐ పేర్కొంది. అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు ఈ చెల్లింపుల వ్యవస్థను యాక్టివేట్ చేసుకునేలా దీన్ని రూపొందిస్తున్నారు.