Site icon NTV Telugu

Tech Layoffs: ఆందోళనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. మైక్రోసాఫ్ట్ భారీగా లేఆఫ్స్

Microf

Microf

Tech Layoffs: కరోనా విజృభణతో ఐటీ, టెక్ రంగం అత్యధికంగా ప్రభావితమైంది. కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో వ్యయ నియంత్రణలు తగ్గించుకోవడం కోసం ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి. దాదాపు రెండు, మూడేళ్ల పాటు ఈ ఉద్యోగాల జోరుగా కొనసాగాయి. ఈ లేఆఫ్స్ తో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజా, ప్రపంచ స్థాయి దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సైతం వేలాది మందిని ఇంటికి సాగనంపడానికి సిద్ధమవుతుంది.

Read Also: Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

అయితే, మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగుల తొలగింపులకు రెడీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సిబ్బందిలో దాదాపు 3 శాతం మేర ఉద్యోగుల లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడే ఛాన్స్ ఉంది. 2023లో 10 వేల మందిని తొలగించిన తర్వాత ఆ స్థాయిలో కోతలు పెడుతుండడం ఇది సెకండ్ టైమ్. కాగా, గత ఏడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్, దాని అనుబంధ సంస్థల్లో 2.28 లక్షల మంది ఎంప్లాయిస్ విధులు నిర్వహిస్తున్నారు. ఇక, ఇప్పుడు అందులో నుంచి 3 శాతం మేర అంటే దాదాపు 6000 మందిని తొలగించేందుకు ప్రణాళికలు రెడీ చేసినట్లు తెలుస్తుంది.

Read Also: Hansika Motwani : నీ అందం చూస్తే.. జాబిలమ్మ కూడా మబ్బుల మాటున దాక్కుంటదేమో హన్సిక

ఇక, మార్కెట్లో కంపెనీని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి అవసరమైన సంస్థాగత మార్పులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. మేనేజ్‌మెంట్ స్థాయులను తగ్గించడం, కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే తమ ముఖ్య లక్ష్యం అన్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయంతో మధ్యస్థ స్థాయిలోని మేనేజ్‌మెంట్ ఎంప్లాయిస్ పై ఎక్కువగా ప్రభావం పేడ అవకాశం ఉందని అంచన. మరోవైపు.. ఈ ఏడాది జనవరిలో పని తీరు ఆధారంగా మరి కొంద మందిని మైక్రోసాఫ్ట్ సంస్థ తొలగించడం గమనార్హం. ఇక, ఇప్పుడు చేపడుతున్న లేఆఫ్‌లకు, ఉద్యోగుల పని తీరుకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version