Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్‌లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
- మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం..
- ఏఐ (AI) రేసు.. ఉద్యోగులకు శాపం
- గతేడాది 15,000 మంది ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Layoffs: ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఐటీ నిపుణులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కోలుకోలేని షాక్ ఇవ్వబోతోంది. సంస్థలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ కోతలు విధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త లేఆఫ్స్ పరంపరలో భాగంగా కంపెనీ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుంచి సుమారు 2.5 శాతం మంది సిబ్బందిని తొలగించనుందట. దీనివల్ల ఒకేసారి 5,000 మందికి పైగా ఉద్యోగుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని సమాచారం.
ఏఐ (AI) రేసు..
మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జెనరేటివ్ ఏఐ టెక్నాలజీ మౌలిక సదుపాయాలలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ కొత్త సాంకేతికత సంస్థ యొక్క పాత సాఫ్ట్వేర్ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందేమోనని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. దీంతో ఏఐ వైపు వేగంగా అడుగులు వేస్తున్న మైక్రోసాఫ్ట్.. ఆ ఖర్చులను భర్తీ చేయడం కోసం సాధారణ వ్యయాలను తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగానే సేల్స్, కన్సల్టింగ్, గేమింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై వేటు వేయనున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో దాదాపు 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Also Read
- GST Collection June 2026: జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
- Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
- WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
- Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్
యూఎస్ (US) ఉద్యోగుల కోసం ఇప్పటికే సంస్థ ఒక ప్రత్యేక స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమాన్ని కూడా తెచ్చింది. వయస్సు, మొత్తం సర్వీసు అనుభవం కలిపి 70 సంవత్సరాలు దాటిన వారికి ఈ సదుపాయం వర్తించనుంది. గత నెల రోజుల్లో మైక్రోసాఫ్ట్ స్టాక్ ఏకంగా 17 శాతం మేర పతనమైంది. ఈ తీవ్ర ఆర్థిక ఒత్తిడి కారణంగానే కంపెనీ ఖర్చులను అదుపు చేయడానికి ఉద్యోగులను రోడ్డున పడేసే కఠిన నిర్ణయానికి మొగ్గు చూపుతోందని అంటున్నారు. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి సంస్థలు వేలాది మందిని తొలగించగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి మైక్రోసాఫ్ట్ కూడా చేరడం ఐటీ రంగాన్ని వణికిస్తోంది. అయితే ఈ లేఆఫ్స్ వార్తలపై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
హార్డ్‌వేర్ తయారీ ఖర్చులు భారీగా పెరగడంతో, ఎక్స్‌బాక్స్ ఉత్పత్తుల ధరలను ఏకంగా $150 (సుమారు రూ.12,500) వరకు పెంచాల్సి వచ్చింది. దీంతో మార్కెట్లో నిలదొక్కుకోవడానికి గేమింగ్ బృందంలో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నారు. నిజానికి మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఈ పింక్ స్లిప్స్ భయాలు కొత్తేమీ కాదు. గత ఏడాది మే నెలలో 6,000 మందిని, ఆ తర్వాత జూలైలో మరో 9,000 మందిని.. ఇలా మొత్తంగా 15,000 మందిని (4% సిబ్బందిని) ఇప్పటి వరకు సంస్థ తొలగించింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా 5,000 మంది ఉద్యోగాలకు లేఆఫ్‌లు ఇవ్వనున్నట్లు కనిపిస్తుండటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్‌లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?