NTV Telugu Site icon

PAC-SEBI: రేపు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్మన్ మాధబి

Madhabipuribuchi

Madhabipuribuchi

సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ గురువారం పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తమ ఎదుట హాజరుకావాలని పార్లమెంట్ కమిటీ మాధబికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సెబీ పని తీరుపై సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ ఎంపీ కేసీ. వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న పార్లమెంట్ కమిటీ ముందు ఆమె హాజరుకానున్నారు. అయితే ఈ చర్యలను బీజేపీ తప్పుపట్టింది. రాజకీయ ప్రేరేపణలతోనే మాధభిని పిలిచారని బీజేపీ సీనియర్ సభ్యుడు ఆరోపణలు చేశారు. పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరు సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలుంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు హాజరుకావాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: APPSC: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకం

ఇదిలా ఉంటే కేంద్రం నిర్వహించిన దర్యాప్తులో మాధబి లేదా ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. సెబీ చీఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఆమె నుంచి ఎలాంటి రాజీనామాలు ఆశించడం లేదని ఉన్నత వర్గాల పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. సెబీ చీఫ్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ మాధబిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల వ్యవహారంపై పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ ఇటీవల చేపట్టిన దర్యాప్తు ముగిసింది. అయితే మాధబి గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినట్లుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సదరు వర్గాలు చెప్పినట్లు సమాచారం. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, మాధబి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Tuition Teacher: 9 ఏళ్ల బాలికను చెంపపై కొట్టిన టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్‌తో ప్రాణాపాయ స్థితి..

అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని గతంలో హిండెన్‌బర్గ్‌ చేసిన పోస్ట్‌ సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆమెపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి. సెబీ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని, ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వేతనం అందుకున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అంతేగాక తన కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్‌తో సెబీకి సంబంధాలున్నాయని ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలను మాధబి కొట్టిపారేశారు. తమ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఇలా చేశారని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: R.S PraveenKumar: “పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి”