NTV Telugu Site icon

LIC Saral Pension: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..జీవితాంతం పెన్షన్ పొందవచ్చు..

New Lic Pension Plan

New Lic Pension Plan

ప్రతి వ్యక్తి డబ్బులను పొదుపు చేసుకోవడం చాలా మంచిది.. యుక్తవయస్సు లో డబ్బులను పొదుపు చేస్తే వృద్ధాప్యంలో ఎటువంటి డోకా ఉండదు.. అందుకే చాలా మంది పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు..ఈమేరకు ఎల్ఐసీ సరికొత్త పాలసిని అందుబాటులోకి తీసుకొని వచ్చింది..అదే సరళ్ పెన్షన్’ స్కీమ్..ఎటువంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడి రావడంతో చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు..ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడిని పొందడంతో పాటు పదవీ విరమణ తరువాత నెలకు కొంత మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది..

ఈ స్కీమ్ బెనిఫిట్స్ విషయానికొస్తే..

ఈ ప్లాన్ 40 నుంచి 80 సంవత్సరాల వయస్సు వారికి వర్తిస్తుంది. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.. కనీసం ఇందులో రెండున్నర లక్షలు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.. ఉదాహరణకు నెలకు రూ.1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. తర్వాత మీకు నెలకు రూ .12,000 పెన్షన్ వస్తుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం వారీగా మీకు అనువైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు..

ఇక రూ. 10 లక్షల ప్రీమియం చెల్లిస్తే సంవత్సరానికి రూ. 64,350 పెన్షన్ పొందవచ్చు. ఇక వార్షిక పెన్షన్ రూ. లక్ష కావాలంటే ప్రీమియం రూ. 20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.. నెలకు లక్ష రూపాయలు పెన్షన్ ను పొందవచ్చు..మరణానంతరం మొత్తం ప్రీమియం మీ నామినీకి అందించడం జరుగుతుంది..

వినియోగదారుడి తర్వాత నామినికి కూడా ఈ పాలసీ వర్తించాలంటే ముందుగా తీసుకొనే ముందు ఆప్షన్ ను ఎంచుకోవాలి..సరళ్ పెన్షన్‌ ప్లాన్‌ను తీసుకునే సమయంలో రెండు ఆప్షన్ ఇస్తారు. మొదటి ఆప్షన్‌లో పెట్టుబడిదారుడికి మాత్రమే పెన్షన్ అందుతుంది. వారి మరణానంతరం ప్రీమియం మొత్తం నామినీకి చెల్లించడం జరుగుతంది. ఇక రెండో ఆప్షన్‌లో ఉమ్మడి లబ్ధిదారు సౌకర్యం ఉంటుంది. ఇందులో ఇన్వెస్టర్ చనిపోయినప్పటికీ నామినికి నెల నెల పెన్షన్ వస్తుంది.ఎల్ఐసీ సరళ్ పెన్షన్‌ ప్లాన్‌లో ప్రీమియం చెల్లించిన 6 నెలల తరువాత లోన్ పొందే అవకాశం ఉంటుంది.. ఒకవేళ మీకు పాలసీ నచ్చకుంటే విరమించుకొనే అప్షన్ కూడా ఉంటుంది..