ఇప్పటికే పాత పాలసీలను రెన్యువల్ చేసుకునే సౌలభ్యాన్ని కల్సించి గుడ్‌న్యూస్ చెప్పిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ చెప్పింది.. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ.. త్వరలో ఐపీవోకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ ఐపీవోలో పాల్గొనే పాలసీదారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.. ఐపీవోలో 10 శాతం డిస్కౌంట్ పాలసీ దారులకు ఇవ్వనున్నట్టు పేర్కొంది.. అయితే, ఎల్ఐసీ యొక్క ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లో షేర్లను కొనుగోలు చేయడానికి ఈ తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది.. ప్రభుత్వం ఈ వారంలో ఆఫర్ పత్రాన్ని దాఖలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషయాన్ని వెల్లడించారు ఓ అధికారి.
Read Also: విశాఖ ఉక్కు లాగే… సింగరేణిపై కుట్ర.. తెలంగాణ ప్రగతిని దెబ్బ కొట్టే ప్రయత్నం..!
ఇక, ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) లేదా ఆఫర్ డాక్యుమెంట్‌ను ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నందున, ఎల్ఐసీ రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దాని మిలియన్ల కొద్దీ పాలసీదారులకు తగ్గింపుతో రావచ్చునని అధికారులు చెబుతున్నారు.. రిటైల్ విండో కింద పాలసీదారులకు నిర్దిష్ట రిజర్వేషన్ను కేటాయిస్తున్నామని తెలిపారు.. ఎల్ఐసీ చట్టం ప్రకారం 10 శాతం వరకు ఇష్యూని పాలసీదారులకు పోటీ ప్రాతిపదికన కొంత తగ్గింపుతో అందించవచ్చని అందుకు కావల్సిన నిబంధనలు రూపొందించినట్లు వెల్లడించారు.. కేవలం పాలసీదారులకే కాకుండా సంస్ధ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్ కల్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఎల్ఐసీ ప్రతిపాదిత ఐపీవోలో సామాన్యులను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. దీంతో ఐపీవోలో 5 శాతం నుంచి 10 శాతం మధ్య వారికి కేటాయింపు వుండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, విక్రయించనున్న షేర్ల శాతాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ యొక్క పాక్షిక ఉపసంహరణ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తగ్గించిన రూ.78,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు.. దీని మునుపటి లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లుగా ఉంది.. అయితే, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు మరియు వాస్తవ రసీదుల అంచనాలు వివిధ కారణాల వల్ల భిన్నంగా ఉండవచ్చు.. ఇక, ఎల్ఐసీ యొక్క ఐసీవో పరిమాణంతో పరస్పర సంబంధం కలిగి ఉండకూడదు, ఇక, ఐపీవో సమయంలో పాలసీదారులు షేర్లను కొనుగోలు చేయడానికి నిర్దిష్ట అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి, ఇది త్వరలో ప్రకటించబడుతుందని ఓ అధికారి తెలిపారు.