ప్రముఖ బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ప్రజలకు అధిక రాబడి ఇచ్చే పెన్షన్ పథకాలను అందిస్తుంది. పెన్షన్ పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు.. ఇందులో కూడా అదిరిపోయే ప్లాన్ ఒకటి ఉంది.. అదే ఎల్ఐసీ జీవన్ ధార . ఇది యాన్యుటీ ప్లాన్. దీనిలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. జీవిత కాలం మొత్తంలో వాయిదాల పద్ధతిలో తిరిగి పొందొచ్చు.. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఈ ఎల్‌ఐసీ పాలసీకి కనీసం 20ఏళ్ల వయస్సు ఉండాలి.. . ఇది ఎలాంటి రిస్క్ కవర్‌ను అందించదు. అయినప్పటికీ దాని ప్రయోజనాలు చాలా ఆసక్తిని కలుగజేస్తాయి. ఈ ఎల్ఐసీ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి కంపెనీ అందించిన రెండు ఎంపికలు ఉన్నాయి. మొదటి ఎంపిక సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ, రెండవది జాయింట్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ.. ఈ ప్లాన్ ను మీ కోసం తీసుకోవచ్చు.. అలాగే మీ కుటుంబంలో మరొకరికి కూడా తీసుకోవచ్చు..
ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్ను బట్టి గరిష్ట వయస్సును నిర్ణయిస్తారు. ఈ గరిష్ట వయో పరిమితి… 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు మైనస్ వేచివుండే కాలం.ప్రీమియం చెల్లింపు కాలం, వేచి ఉండాల్సిన వ్యవధి యాన్యుటీ ఆప్షన్, యాన్యుటీ చెల్లింపు విధానాన్ని ఎంచుకునే అవకాశం పాలసీదారుకు ఉంటుంది.. నెలనెలా, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 12 నెలలకు ఒకేసారి చొప్పున యాన్యుటీ పేమెంట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్ను ఇక మార్చలేరు..ఈ ప్లాన్లో 11 యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎల్ఐసీ వెబ్సైట్లోకి వెళ్లి మీకు అనువైన ఆప్షన్ ఎంచుకోవచ్చు.. మీరు మొదటి ప్రీమీయం చెల్లించిన తర్వాత భీమా రక్షణ ప్రారంభం అవుతుంది.. ప్రీమియంలు కడుతున్న సమయంలోనైనా, ఆ తర్వాతైనా ఈ పాలసీ మీద లోన్ తీసుకోవచ్చు..