Site icon NTV Telugu

Disney Hotstar: డిస్నీ హాట్‌స్టార్‌కి జియో సినిమా దెబ్బ.. 4 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఔట్..

Jiocinema

Jiocinema

Disney Hotstar: స్ట్రీమింగ్ దిగ్గజంగా ఉన్న డిస్నీ హాట్‌స్టార్‌ వేగంగా తన సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. ముఖ్యంగా ఇండియాలో జియో సినిమా దెబ్బకు కుదేలవుతోంది. జియోసినిమా IPL స్ట్రీమింగ్ ని ఫ్రీగా అందించడంతో వినియోగదారులు ఎక్కువగా జియోసినిమాకు కనెక్ట్ అవుతున్నారు. తక్కువ సమయంలో జియోసినిమా ఎక్కువ ప్రజాధరణ పొందేందుకు ఇది కారణం అయింది. ఇది డిస్నీ హాట్‌స్టార్‌ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆసియాలో డిస్నీ సబ్‌స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో, స్ట్రీమింగ్ దిగ్గజం 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. అక్టోబర్ 2022 నుంచి ఏకంగా 8.4 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది.

Read Also: తమిళ డైరెక్టర్స్ చేతిలో మోసపోయిన తెలుగు హీరోలు వీరే..?

ఇండియాలో స్ట్రీమింగ్ దిగ్గజంగా జియోసినిమా ఎదగాలని అనుకుంటోంది. అందుకోసం వేగంగా పావులు కదుపుతోంది. 2023 తొలి మూడు నెలల్లోనే జియోసినిమాకు 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను పొందింది. 2023 తొలి త్రైమాసికంలో డిస్నీ హాట్ స్టార్ చందాదారులు 3.8 మిలియన్ల తగ్గి 57.5 మిలియన్లకు చేరింది. వరసగా రెండు త్రైమాసికాల్లో డిస్నీ క్షీణతను ఎదుర్కోవాల్సి వచ్చింది.

జియోసినిమా వచ్చీ రావడంతోనే ఐపీఎల్ తో సహా మొత్తం ఫ్రీగా అందించింది. ఇది డిస్నీ హాట్ స్టార్ ను దెబ్బకొట్టింది. ఉచితంగా వస్తున్నపుడు ప్రజలు ఎందుకు డబ్బులు కట్టాలని భావిస్తారు. ఇదే డిస్నీని దెబ్బతీసింది. ఇదిలా ఉంటే రిలయన్స్ జియో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో ప్రముఖ హాలీవుడ్ కంటెంట్‌ను దాని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, జియోసినిమాకు తీసుకురావడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. రిలయన్స్ యొక్క వయాకామ్ 18 మరియు వార్నర్ బ్రదర్స్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా హెచ్‌బిఓ కంటెంట్‌తో పాటు వార్నర్ బ్రదర్స్ షోలు కూడా జియోసినిమాలో అందుబాటులోకి వస్తాయి. గతంలో HBO కంటెంట్ డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండేది. ఈ రెండింటి మధ్య ఒప్పందం మార్చి 31తో ముగిసింది. ఆ తరువాత జియోసినిమా HBOతో ఒప్పందం చేసుకుంది.

Exit mobile version