NTV Telugu Site icon

JioCinema: జియో సినిమా బిగ్ డీల్.. ఇకపై హెచ్‌బీఓ , వార్నర్ బ్రదర్స్ కంటెంట్..

Jiocineme

Jiocineme

JioCinema: జియో సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్‌‌ఫాంగా మార్చేందుకు రిలయన్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఐపీఎల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ గా ఉన్న జియో సినిమా ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. దీంతో రానున్న రోజుల్లో పెయిడ్ సబ్‌స్ట్రిప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ మ్యాచులు మే 28తో ముగిసిన వెంటనే జియో సినిమా ఇకపై ఫ్రీగా వీక్షించే అవకాశం ఉండదని చెప్పకనే చెప్పింది. కొత్త కంటెంట్ ను యాడ్ చేయడంతో పాటు యూజర్లను ఆకర్షించేలా ప్లాన్స్ తీసుకువచ్చేందుకు సిద్ధం అయింది.

Read Also: The Kerala Story: ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహాలో మరో సినిమా! వివాదాల నీలినీడలు!!

ఇదిలా ఉంటే ప్రస్తుతం జియో సినిమా భారీ డీల్ కుదుర్చుకుంది. హాలీవుడ్ కంటెంట్ అందించే వార్నర్ బ్రదర్స్, హెచ్‌బీఓ, డిస్కవరీతో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ వెంచర్, వయాకామ్ 18, దాని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోసినిమాలో హాలీవుడ్ కంటెంట్ తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసమే ఈ భారీ ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వార్నర్ బ్రదర్స్ అలాగే దాని హెచ్‌బీఓ కంటెంట్ జియో సినిమా యాప్ లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలు పూర్తిగా తెరపైకి రాలేదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, లార్డ్ ఆఫ్ రింగ్స్, హ్యరీపోటర్ సీరిస్ వంటి హెచ్‌బీఓ కంటెంట్ ఇకపై జియో సినిమాలో అందుబాటులోకి వస్తుంది.

మార్చి 31న డిస్నీ హాట్‌స్టార్ నుంచి హెచ్‌బీఓ తమ కంటెంట్ ను తొలగించుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కు కూడా హెచ్‌బీఓ తమ కంటెంట్ ను ఇక మీదట ఇవ్వదని తెలుస్తోంది. భారతదేశంలో హెచ్‌బీఓకు కేరాఫ్ గా జియో సినిమా పనిచేయనుంది. హెచ్‌బీఓ సిరీస్, మ్యాక్స్ సిరీస్, వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ సీరీస్‌లు యూఎస్ తో పాటు ఇండియాలో కూడా ఒకే రోజు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఇండియన్ ఓటీటీ మార్కెట్ లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటివే అగ్రస్థానంలో ఉన్నాయి. జియో సినిమా త్వరలోనే కీలక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గా ఎదగాలని అనుకుంటోంది.