NTV Telugu Site icon

జియో మ‌ళ్లీ ఆ ప్లాన్ తెచ్చింది.. కానీ..!

Jio

టెలికం రంగంలో జియో అడుగు పెడుతూనే సంచ‌ల‌నం సృష్టించింది.. అన్నీ ఫ్రీ అంటూ ఆక‌ట్టుకుని.. టారీఫ్ అమ‌లు చేసినా.. క్ర‌మంగా వినియోగ‌దారుల‌ను పెంచుకుంది.. జియో టారీప్ అమ‌లు చేసిన త‌ర్వాత రూ.98 ప్యాకేజీకి భ‌లే డిమాండ్ ఉండేది.. క్ర‌మంగా అది క‌నుమ‌రుగైపోయింది.. కానీ, అతి చవకైన ఆ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది జియో.. అయితే, గ‌తంలో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండ‌గా.. ఇప్పుడు 14 రోజులకు కుదించ‌బ‌డింది.. ఇక‌, ఈ ప్లాన్ కింద జియో అందిస్తోన్న ఆఫ‌ర్‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 21 జీబీ డేటాను అందిస్తోంది.. అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు జియో యాప్స్‌ను సైతం ఉప‌యోగించుకునే వీలుంది.. అంటే.. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ తదితర ప్రయోజనాలు పొంద‌వ‌చ్చు.. ఇప్ప‌టి వ‌ర‌కు జియోలో అతిత‌క్కువ ప్లాన్ రూ.129 ఉండ‌గా.. ఇప్పుడు దానిని రూ.98కు కుదించింది ఆ సంస్థ‌.

ఇక‌, ఈ నెల ప్రారంభంలో, జియో త‌న‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాలో రూ. 39 మరియు రూ. 69 ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి.. రెండూ 14 రోజుల చెల్లుబాటును కలిగి ఉండా.. అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కలిగి ఉన్నాయి.. అయితే, రూ. 39 ప్లాన్ రోజుకు 100 ఎంబీ డేటాను వాడుకునే వీలుండ‌గా.. రూ. 69 ప్లాన్ రోజువారీ 0.5 జీబీ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.