NTV Telugu Site icon

Jio 5G: శ్రీనాథ్‌జీ ఆలయం.. జియో 5జీ ఆరంభం.. ఏమిటీ అనుబంధం?

Jio 5g

Jio 5g

Jio 5G: రిలయెన్స్‌ జియో చైర్మన్‌ ఆకాష్‌ అంబానీ ఇవాళ రాజస్థాన్‌లో జియో 5జీ బీటా సర్వీసులను ప్రారంభించారు. రాజ్‌సమంద్‌లోని నాథద్వారాలో ఉన్న ప్రసిద్ధ శ్రీనాథ్‌జీ ఆలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబానీలకు ఈ దేవుడి పైన అపార నమ్మకం ఉంది. శ్రీనాథ్‌జీని తమ కుటుంబ దైవంగా కొలుస్తారు. గతంలో రిలయెన్స్‌ జియో 4జీ సర్వీసులను సైతం ఇక్కడే ప్రారంభించటం విశేషం. ఆకాష్‌ అంబానీ తండ్రి ముఖేష్‌ అంబానీ గత నెలలో ఈ గుడికి వచ్చినప్పుడు జియో 5జీ సర్వీసులను ఇక్కడే ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Rupee Trade: రూపాయల్లో ట్రేడింగ్‌కి రెస్పాన్స్‌ బ్రహ్మాండం

ఆయన ప్రకటనకు తగ్గట్లుగానే ఇవాళ ఆకాష్‌ అంబానీ జియో 5జీ వైఫై సేవలను సైతం దేశంలోనే మొదటిసారిగా ఇక్కడ ఆరంభించారు. రాజస్థాన్‌తోపాటు చెన్నైలోనూ జియో 5జీ సర్వీసులు అందుబాటులోకి రావటం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఆరు చోట్ల (ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి సహా) జియో 5జీ బీటా సేవలు ప్రారంభించినట్లయింది. ఈ సందర్భంగా ఆకాష్‌ అంబానీ మాట్లాడుతూ త్వరలోనే 5జీ ట్రూ సర్వీసులను దేశవ్యాప్తంగా లాంఛ్‌ చేస్తామని చెప్పారు. జియో అధిపతిగా పగ్గాలు చేపట్టాక ఆయన చేసిన మొదటి ప్రకటన ఇదే కావటం చెప్పుకోదగ్గ అంశం.

Show comments