విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల ఫేవరెట్ డెస్టినేషన్‌గా దుబాయ్ మారింది. కానీ.. దుబాయ్ ద్వారా చాలా పన్ను ఎగవేత జరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. దుబాయ్‌లోని భారతీయుల అప్రకటిత స్థిరాస్తుల గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది. 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తెలిసింది. వాటిపై ఇప్పుడు భారత్ చర్యలు తీసుకోవచ్చు. అంటే ఒకవేళ అక్కడ దాచుకున్న ఆస్తుల గురించి భారత ఆదాయపు పన్ను శాఖకు ఎటువంటి సమాచారం లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆస్తులను తప్పుదోవ పట్టించే ఆస్తులుగా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
ఢిల్లీలో లెక్కలు చూపని రూ.700 కోట్ల లావాదేవీలు..
ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్‌లో ఒక్క ఢిల్లీ నుంచే రూ.700 కోట్లకు పైగా లెక్కల్లో చూపని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారి ప్రకారం.. డిపార్ట్‌మెంట్ యొక్క ఢిల్లీ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ డజనుకు పైగా సోదాలు నిర్వహించింది. ఇందులో
ఒక్క ఢిల్లీలోనే రూ.700 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు అనుమానిస్తున్నట్లు అధికారి తెలిపారు. విచారణ భారతదేశం అంతటా ఉన్నందున.. ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఈ మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
జర్మనీ సమాచారాన్ని అందజేసింది..
ఇటీవల జర్మనీ మధ్యప్రాచ్యంలో భారతీయులకు చెందిన ఆస్తుల గురించి సమాచారాన్ని భారత్‌తో పంచుకుంది. వెయ్యి మందికి పైగా భారతీయులకు చెందిన ఆస్తుల వివరాలను పొందుపరిచినట్లు సమాచారం. అలాంటి సమాచారం జర్మనీ అధికారుల చేతికి ఎలా వచ్చిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
రూ.125 కోట్లకు పైగా నగదు పెట్టుబడి..
ఢిల్లీలో జరిగిన దాడుల్లో పన్ను చెల్లింపుదారులు రూ.125 కోట్లకు పైగా అప్రకటిత నగదు పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించారని అధికారి తెలిపారు. ఈ దాడిలో నకిలీ నగదు చెల్లింపులు, రశీదులు, నకిలీ కొనుగోలు రశీదులు గుర్తించినట్లు ప్రజలు వెల్లడించారు. అక్టోబర్ చివరి నుంచి ప్రభుత్వం పంచుకున్న ఈ సమాచారం ఆధారంగా అనేక నోటీసులు జారీ చేయబడ్డాయి.
దోచుకున్న డబ్బే?
చాలా మంది రాజకీయ నాయకులు ప్రజల వద్ద దోచుకున్న డబ్బును అక్రమంగా దుబాయ్‌కి తరలిస్తున్నట్లు ఇది వరకు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఏళ్లుగా అధికారంలో ఉంటూ.. అక్రమంగా సంపాధించిన డబ్బుతో అక్కడ భవనాలు, హోటళ్లు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదాయ పన్ను శాత వీటిపై దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలి.!