NTV Telugu Site icon

Intel: ఇంటెల్ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ఆఫీసులో..!

Intel

Intel

ప్రముఖ టెక్ దిగ్గజం కంపెనీ ఇంటెల్.. తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్‌కు ఉచిత పానీయాలు తిరిగి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది. టీ, కాఫీని తిరిగి ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ సందేశం పంపించింది. వ్యయ నియంత్రణ, నిర్వహణ సమస్యలతో సతమవుతున్న ఇంటెల్‌ దాదాపు ఏడాది పాటు ఉచిత పానీయాలు నిలిపివేసింది. అయితే ఉచిత పానీయాలు నిలిపివేయడంతో ఉద్యోగుల్లో ఆసక్తి తగ్గుతున్నట్లుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో తిరిగి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు పాత సౌకర్యాలను తిరిగి పునరుద్ధరించింది. ఉద్యోగుల రోజువారీ జీవితంలో చిన్న సౌకర్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు అంతర్గత సందేశంలో ఇంటెల్‌ తెలిపింది.

ఇది కూడా చదవండి: Divya Sridhar: 50 ఏళ్ల నటుడితో 40 ఏళ్ల నటి రెండో పెళ్లి

‘‘ఇంటెల్ ఇప్పటికీ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, చిన్న సౌకర్యాలు మన దినచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అర్థం చేసుకున్నాము. ఇది ఒక చిన్న అడుగు అని మాకు తెలుసు, కానీ మన కార్యాలయ సంస్కృతికి మద్దతు ఇవ్వడంలో ఇది అర్ధవంతమైనదని మేము ఆశిస్తున్నాము.’’ అని ఇంటెల్ వివరించింది. ఇదిలా ఉంటే ఉచిత పానీయాల సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ ఉచితంగా అందించే ఫ్రూట్స్‌‌ను అందించడం లేదని తెలిపింది. ఈ వసతిని మళ్లీ కల్పించేందుకు ఇంటెల్‌ సిద్ధపడలేదని స్పస్టం చేసింది.

ఇది కూడా చదవండి: Donald Trump: ట్రంప్‌తో భారతీయులకు చిక్కులేనా..? వారి పిల్లలకు పౌరసత్వం డౌటేనా..?

Show comments