NTV Telugu Site icon

Soaps price: బాత్‌రూమ్‌ని తాకిన ద్రవ్యోల్బణం.. సబ్బులు, షాంపూల ధరలు పెంపు..

Soaps

Soaps

ద్రవ్యోల్బణం ఇప్పుడు బాత్‌రూమ్‌ని తాకింది.. ఇప్పటికే తినడం, తాగడంపై దాని ఎఫెక్ట్‌ పడగా.. ఇప్పుడు స్నానం చేయడం మరియు కడగడం కూడా ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. అదే, సబ్బులు మరియు షాంపూల ధరలు పెరిగాయి.. హెచ్‌సీఎల్‌ తన ఉత్పత్తుల ధరలను 15 శాతం వరకు పెంచింది. ఈ పెరుగుదల తర్వాత, మీ బాత్రూమ్ బడ్జెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, టూత్‌పేస్ట్, కెచప్ వంటి ఇతర వస్తువుల ధరలను కూడా హెచ్‌సీఎల్‌ పెంచింది.. వాటి ధరలు 4 మరియు 13 శాతం మధ్య పెరిగాయి.

Read Also: New Judges: సుప్రీంకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు

క్రమంగా పెరుగుతూ ఆల్‌టైం హై రికార్డు సృష్టించిన చమురు ధరలతో ఇప్పటికే ఎంఎంసీజీ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆ తర్వాత కంపెనీ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా.. ప్రస్తుతం క్లినిక్‌ ప్లస్‌ షాంపూ 100 మిల్లీమీటర్ల ప్యాక్‌ ధర 15శాతం పెరగ్గా.. ఇతర షాంపూల ధరలు పెరిగాయని డిస్ట్రిబ్యూటర్ వర్గాలు పేర్కొన్నట్లు సంబంధిత నివేదికలు చెబుతున్నాయి.. 125 గ్రాముల పియర్స్ సోప్‌ ప్రస్తుతం 2.38 శాతం పెరిగి రూ.86 చేరగా.. మల్టీప్యాక్‌పై 3.7శాతం వరకు పెరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.. లక్స్‌ సోప్‌ మల్టీప్యాక్‌ ధరలను కంపెనీ నేరుగా తొమ్మిది శాతం వరకు వడ్డించింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ సబ్బులు, షాంపూల ధరలను మాత్రమే కాకుండా కంపెనీ తయారు చేసే పలు ఉత్పత్తుల ధరలను సైతం పెంచేసింది.. వీటిలో హార్లిక్స్‌, బ్రూ కాఫీ, కిసాన్‌ కెచప్‌ తదితర ఉత్పత్తుల ధరలను 4 నుంచి 13శాతం వరకు పెంచినట్లు స్పష్టం చేస్తున్నాయి నివేదికలు.

కాగా, దేశంలో ద్రవ్యోల్బణం సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్బీఐ బుధవారం రెపో రేట్లను పెంచగానే.. దేశంలోని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్‌బీఐ నిర్ణయం తర్వాత ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా వేయగా నేడు దాని ప్రభావం కనిపించింది. స్నానం చేయడం, కడుక్కోవడం కూడా ఇప్పుడు ఖరీదైంది, అవును, వంటగది నుండి మొదలైన ద్రవ్యోల్బణం ఇప్పుడు బాత్రూమ్‌ వరకు వచ్చిందన్నమాట..