Site icon NTV Telugu

Stock Market: సంక్రాంతి జోష్.. లాభాలతో ముగిసిన సూచీలు.. అదానీ షేర్లు పరుగులు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌లో సంక్రాంతి జోష్ కనిపించింది. వరుస నష్టాలతో కుదేలవుతున్న మార్కెట్‌లో మంగళవారం పండగ ఉత్సాహం కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాల కారణంగా కొద్ది రోజులుగా లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మంగళవారం మాత్రం అందుకు భిన్నంగా లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా గ్రీన్‌లోనే కొనసాగాయి.

ఇది కూడా చదవండి: Meta: “మెటా”కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..

కొద్దిరోజులుగా అమెరికా చేసిన లంచాల ఆరోపణల కారణంగా పడిపోయిన అదానీ షేర్లు.. మంగళవారం పుంజుకున్నాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్ ప్రధాన లాభాల్లో ఉండగా.. హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, అపోలో హాస్పిటల్స్, టైటాన్ కంపెనీ, టీసీఎస్ నష్టపోయాయి. సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 76, 499 దగ్గర ముగియగా.. నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 23, 176 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.86.64 సరికొత్త కనిష్ట రికార్డ్‌ స్థాయిలో ముగిసింది.

ఇది కూడా చదవండి: Sankranthi Celebrations: కోడిపందాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేస్తున్న అతిధులు..

Exit mobile version