Indians Foreign Travel: సమయం దొరికిందంటే చాలు.. విహార యాత్రలు ప్లాన్ చేసుకునేవాళ్లు.. సమయం కుదుర్చుకుని మరీ టూర్లు తిరిగేవారు.. ఇలా టూరిస్టుల సంఖ్య భారీగా ఉంటుంది.. కొందరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు వేసుకుంటే.. మరికొందరు విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి మొగ్గుచూపుతారు.. కరోనా మహమ్మారి విజృంభణతో దీనికి కొంత బ్రేక్ పడినా.. ఆ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు రావడంతో.. యథావిథిగా విదేశీ విహార యాత్రలకు వెళ్తున్నారు.. అయితే, విదేశీ ట్రిప్‌ల కోసం భారతీయులు ప్రతి నెలా ఖర్చు చేస్తున్న మొత్తాన్ని చూస్తే మాత్రం నోరువెల్లబెట్టాల్సిందే..! ఎందుకుంటే..? ఇండియన్స్ దాదాపు 1 బిలియన్ డాలర్లను ప్రతీ నెల విదేశీ టూర్లపై ఖర్చు పెడుతున్నారు. ఈ వ్యయం కోవిడ్‌కు ముందు ఉన్న దాని కంటే చాలా ఎక్కువ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విదేశీ చెల్లింపులపై డేటా బయటపెట్టింది..
Read Also: Trinamool MP: ప్రధాని మోదీని అసురతో పోల్చిన టీఎంసీ ఎంపీ.. జైశంకర్‌పై మండిపాటు
భారతీయులు ప్రతి నెలా దాదాపు 1 బిలియన్ అమెరికన్ డాలర్లను విదేశీ ప్రయాణాలకు ఖర్చు చేస్తున్నారు, ఇది కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిల కంటే చాలా ఎక్కువ అని ఆర్బీఐ పేర్కొంది.. 2022-22 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో, ‘ప్రయాణం’ కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద బాహ్య చెల్లింపులు 9.95 బిలియన్ డాలర్లు.. ఆర్బీఐ డేటా ప్రకారం, 2021-22లో ప్రయాణానికి సంబంధించిన ఖర్చు కేవలం 4.16 బిలియన్ డాలర్లు కాగా.. 2019-20కి ముందు కోవిడ్ సంవత్సరంలో అది 5.4 బిలియన్ డాలర్లుగా ఉంది.. మొత్తం 2021-22 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాల కోసం చెల్లించిన మొత్తం 7 బిలియన్లుగా ఉంది.. కానీ, ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోతోంది. అయితే, భారతీయులు తమ కుటుంబాలు లేదా స్నేహితులతో ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు. వియత్నాం, థాయిలాండ్, యూరప్ మరియు బాలి లాంటి దేశాల్లో విహారానికి భారతీయులు ప్రధానంగా ఇష్టపడుతున్నారు.. ఇక, యూరప్, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్ మరియు దుబాయ్ లాంటి ప్రాంతాలు భారతీయులు ఇష్టపడే కొన్ని ప్రధాన గమ్యస్థానాలు.
Read Also: Mahesh Kuma Goud : ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.. మేయర్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు
సరసమైన ప్రయాణాల పెరుగుదల మరియు సాంకేతిక పురోగతితో, ట్రావెల్ పరిశ్రమ అంతర్జాతీయ గమ్యస్థానాలలో భారీ బూమ్‌ను కనిపిస్తోందంటున్నారు. యూరప్, బాలి, వియత్నాం మరియు దుబాయ్ వంటి ప్రదేశాలకు భారతీయులలో డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు.. ప్రయాణికులు “ప్రయాణం ఇప్పుడు చేయండి.. తర్వాత చెల్లించండి” అనే భావనకు అలవాటు పడ్డారని, ఇది తేదీకి దగ్గరగా బుకింగ్ చేయడానికి మరియు వారి జేబులో లేని గమ్యాన్ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు.. నెలవారీ చెల్లింపు ప్లాన్‌లో ప్రయాణాలు పెరిగిపోయాయి.. కాబట్టి, గోవా కోసం వెతుకుతున్న వ్యక్తి ఇప్పుడు థాయ్‌లాండ్‌కు వెళ్లవచ్చు.. థాయ్‌లాండ్ కోసం ప్లాన్ చేసే వ్యక్తి సుదూర తూర్పును ఎంచుకోవచ్చు అంటున్నారు.. ఇదిలా ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ రేటును ప్రస్తుత 5 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన భారతీయుల విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ప్రయాణలపై భారతీయులు ఖర్చు చేసే మొత్తం ఈ ఏడాది మరింత భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.