Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. పతనానికి కారణమిదే!

  • భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
  • లాభాల్లోంచి నష్టాల్లోకి జారుకున్న సూచీలు
  • దెబ్బతీసిన అంతర్జాతీయ పరిణామాలు
Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం ఉదయం ప్రారంభంలో భారీ లాభాలతో దూసుకెళ్లిన సూచీలు.. కొద్దిసేపటికే ఒడిదుడుకులకు గురైంది. లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. దీంతో పెట్టుబడిదారులు లబోదిబో అన్నారు. ప్రారంభంలో వచ్చిన లాభాలన్నీ కోల్పోయాయి. ఆయా రంగాల్లో ఐటీ మినహా మిగతా రంగాలన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 508 పాయింట్లు నష్టపోయి 72, 740 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 229 పాయింట్లు నష్టపోయి 225 దగ్గర కొనసాగుతోంది.

ఎఫ్‌ఐఐల అమ్మకాలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా అంతర్జాతీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్ మార్కెట్ ఘోరంగా దెబ్బతింది.

మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కో., హిండాల్కో ఇండస్ట్రీస్ షేర్లు గణనీయమైన ప్రతికూల ఒత్తిడిని పెంచగా.. ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగుపడ్డాయి. టీసీఎస్ 3 శాతం పెరిగి కీలక సూచీలో అగ్రగామిగా నిలవగా.. హిండాల్కో ఇండస్ట్రీస్ 2 శాతం పైగా పడిపోయి అత్యంత దెబ్బతిన్న స్టాక్‌గా నిలిచింది.