Indian Rupee: ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి.. తొలిసారిగా 93 మార్కును దాటిన డాలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee: భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయి పతనాన్ని చవిచూసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 93 మార్కును దాటి సరికొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Iran Vs Israel War: ఒకే యుద్ధం.. మూడు కథలు.. మూడు నిజాలు..! ఇరాన్ గెలవబోతుందా?
Also Read
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
రికార్డు కనిష్ట స్థాయిలు ఇలా..
బుధవారం రూపాయి 92.89 వద్ద ముగియగా, గురువారం గుడి పడ్వా సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. శుక్రవారం మార్కెట్ ప్రారంభం కాగానే రూపాయి 19 పైసలు క్షీణించి 93.08 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మరింత పతనం కాకుండా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) డాలర్లను విక్రయిస్తూ రంగంలోకి దిగినప్పటికీ, ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ బలాన్ని తెలిపే ‘డాలర్ ఇండెక్స్’ 0.17 శాతం పెరిగి 100.25 వద్దకు చేరింది.
రూపాయి విలువ ఎందుకు తగ్గుతుందంటే..
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు $107 వద్ద కొనసాగుతున్నాయి. ఇది భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాల కరెన్సీపై భారాన్ని పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్చి నెలలో ఇప్పటివరకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ల నుంచి సుమారు 8 బిలియన్ డాలర్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. జనవరి 2025 తర్వాత ఇదే అతిపెద్ద ఉపసంహరణ కావడం గమనార్హం.
సామాన్యుడిపై ప్రభావం ఎంత?
రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ‘దిగుమతి ద్రవ్యోల్బణం’ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు దిగుమతులు ఖరీదైనవిగా మారి, ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజులు, విదేశీ పర్యటనలకు వెళ్లే వారి ఖర్చులు భారీగా పెరుగుతాయని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ వంటి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు కూడా పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు.
స్టాక్ మార్కెట్ ఆశలు..
మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్ 960 పాయింట్లు పెరిగి 75,167 వద్ద, నిఫ్టీ 311 పాయింట్ల లాభంతో 23,313 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్లు లాభాల్లో ఉండటం రూపాయి మరీ దారుణంగా పడిపోకుండా కొంతవరకు అడ్డుకోగలిగిందని అంటున్నారు. భవిష్యత్తులో చమురు సరఫరా మెరుగుపడితే తప్ప రూపాయికి ఇప్పుడప్పుడే ఉపశమనం లభించేలా లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
READ ALSO: Dhurandhar 2: ధురందర్ 2 లో ఊహించని క్లైమాక్స్.. పార్ట్ 3 ఉంటుందా?
తాజావార్తలు
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్‌గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!