NTV Telugu Site icon

RBI: 86 ఏళ్ల నాటి రూ.10,000 నోటు విడుదల.. విశేషాలు ఇవే..!

Rbi

Rbi

10 వేల నోట్లు మీరు ఎప్పుడైనా చూశారా? ఇండియాలో 10 వేల నోట్లు ఉండేవని కనీసం పెద్దలైనా ఎప్పుడైనా గుర్తుచేశారా? ఎవరు చెప్పలేదా? ఆ ఊసే ఎప్పుడు వినబడలేదా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

ఏంటి? భారత్‌లో 10 వేల నోట్లు ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారా?, ఆశ్చర్యపోనక్కర్లేదు. మీరు చదువుతోంది నిజమే. దాదాపు 8 దశాబ్దాల క్రితం భారతదేశంలో 10 వేల నోట్లు చెలామణిలో ఉండేవి. నిన్నామొన్నటి వరకు భారత్‌లో రూ.1000, రూ.2000 వేల నోట్లు ఎలా ఉండేవో.. 86 ఏళ్ల క్రితం కూడా ఇండియాలో 10 వేల నోట్లు ఉండేవి. ఆ నోట్లను తాజాగా ఆర్బీఐ విడుదల చేసింది.

1938లో చెలామణిలో ఉన్న రూ.10,000 వేల నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు ముద్రింపబడిన అదిపెద్ద డినామినేషన్ నోటు ఇదే కావడం విశేషం. అనంతరం బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టేందుకు ఇది రూ.1946లో డీమోనిటైజ్ చేశారు. తిరిగి 1954లో ప్రవేశపెట్టారు. కానీ 1946 నాటి పరిస్థితులే తలెత్తడంతో తిరిగి 1978లో మరోసారి శాశ్వతంగా డీమోనిటైజేషన్ చేయబడింది.

రూ.5,000, రూ.10,000 నోట్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉండేవి. సాధారణ పౌరులు ఇంత పెద్ద మొత్తాలను చాలా అరుదుగా నిర్వహించేవారు. ఈ నోట్లను ఎక్కువగా ఆర్థిక లావాదేవీల కోసం.. వ్యాపారాల కోసం వినియోగించేవారు. అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలు అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946, జనవరిలో రద్దు చేయాలని నిర్ణయించింది. బ్రిటీష్ ప్రభుత్వం రద్దు చేసినా.. తిరిగి 1954లో ఆ రెండు నోట్లు చెలామణిలోకి వచ్చాయి. ఇక స్వతంత్రంగా భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1978లో రూ.5000, రూ.10000 వేల నోట్లను ఆర్బీఐ రద్దు చేసింది. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఆర్థిక అవకతవకలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

ఆర్బీఐ ప్రకారం.. మార్చి 31, 1976 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు రూ.7,144 కోట్లుగా ఉంది. ఇందులో రూ.1,000 నోట్లు రూ.87.91 కోట్లు. రూ.5,000 నోట్లు రూ.22.90 కోట్లు కాగా.. రూ.10,000 నోట్ల విలువ రూ.1,260 మాత్రమే. మొత్తంగా ఈ అధిక-డినామినేషన్ నోట్లు మొత్తం కరెన్సీలో 2% కంటే తక్కువగా ఉన్నాయి.

అయితే రూ. 5,000, రూ. 10,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భావించారు. పరిశీలన కూడా జరిగింది. తిరిగి రావచ్చని సూచించారు, అయితే చివరికి ఆ ఆలోచన విరమించుకుంది. బదులుగా 2016 డిమోనిటైజేషన్ సమయంలో రూ. 500 మరియు రూ. 1,000 నోట్లను ఉపసంహరించుకున్నప్పుడు ప్రభుత్వం రూ. 2,000 నోటును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకారం.. డీమోనిటైజేషన్ వల్ల ఏర్పడిన నగదు కొరతను తగ్గించడానికి 2,000 రూపాయల నోటును త్వరగా ముద్రించి పంపిణీ చేశారు. అయితే మే 19, 2023న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.