NTV Telugu Site icon

India’s Manufacturing Sector Surges: చైనా ఆట ముగిసింది?.. తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్

Pm Modi

Pm Modi

తయారీ రంగంలో గొప్పగా చెప్పుకునే చైనా ఇప్పుడు ఇందులో చాలా వెనుకబడిపోయింది. ఒకవైపు చైనా ఆర్థిక వృద్ధి చాలా నెమ్మదిగా ఉండగా.. భారత్‌కు శుభవార్త అందింది. హెచ్‌ఎస్‌డీసీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్ యొక్క తయారీ రంగం అక్టోబర్‌లో విస్తరించింది. ఈ విషయంలో భారత్ చైనాను అధికమించిందని నివేదిక తెలిపింది. ఈ పెరుగుదలకు కారణం విదేశాల్లో భారత్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కొత్త ఆర్డర్‌లను అందుకోవడమే కాకుండా అమ్మకాలు కూడా పెరిగాయి. దీంతో అక్టోబర్‌లో ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. అక్టోబర్‌లో భారతదేశం ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, అమెరికా నుంచి మరిన్ని ఆర్డర్‌లను పొందింది. దీని కారణంగా తయారీ రంగం విజృంభించింది.

భారత్ పురోగతి?
అక్టోబర్‌లో ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.5 పాయింట్లకు పెరిగింది. ఇది సెప్టెంబర్‌లో 56.5 పాయింట్లు గా ఉండేది. పెరుగుతున్న పీఎమ్‌ఐ ఆపరేటింగ్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయని హెచ్‌ఎస్‌డీసీ నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు చైనా పీఎంఐ 50.30 పాయింట్లుగా ఉంది. అయితే.. అక్టోబర్‌లో చైనా పీఎమ్‌ఐలో కొంత పెరుగుదల కనిపించింది. కానీ టోటల్ పాయింట్లలో భారత్ కంటే వెనుకబడి ఉంది.

భారతదేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ ..
ఇటీవలి కాలంలో భారతదేశంలో తయారైన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. చాలా విదేశీ కంపెనీలు భారీ సంఖ్యలో ఆర్డర్లను బుక్ చేసుకున్నాయి. ప్రస్తుత దశలో ఆర్డర్‌ల సంఖ్య గత 20 ఏళ్లలో వచ్చిన ఆర్డర్‌ల సగటు సంఖ్యను మించిపోయింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, విజయవంతమైన మార్కెటింగ్ వస్తువుల అమ్మకాలను పెంచడంలో సహాయపడిందని నివేదిక పేర్కొంది.

ఉద్యోగుల సంఖ్య పెరుగుదల…
డిమాండ్ పెరగడంతో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. అంటే ఉపాధి అవకాశాలు పెరిగాయి. తాజా డేటా ప్రకారం.. తయారీదారులు అక్టోబర్‌లో అదనపు ఉద్యోగులను నియమించుకున్నారు. ఈ సంఖ్య సెప్టెంబరులో కొత్తగా తీసుకున్న ఉద్యోగుల కంటే ఎక్కువ. అక్టోబర్ డేటా సేకరణ దాదాపు 20 ఏళ్లలో అత్యధికం. భవిష్యత్ ఉత్పత్తి వాల్యూమ్‌ల గురించి భారతీయ తయారీదారులు మరింత ఆశాజనకంగా మారారని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక పేర్కొంది.

Show comments