Hyderabad : ఒక్క అక్టోబర్ నెలలో రూ.3,170 కోట్ల విలువ గల నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ సంవత్సరానికి 25% (YoY) పెరిగింది . అక్టోబర్ 2023లో 5,787 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది..నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. ఏడాది ప్రాతిపదికన 25% పెరుగుదల గమనించబడింది. నెలలో నమోదైన ఆస్తుల మొత్తం విలువ 3,170 కోట్లు గా ఉంది. ఇది కూడా 41% పెరిగింది, ఇది అధిక విలువ ఉన్న గృహాల అమ్మకం వైపు మొగ్గు చూపిస్తుంది.. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి అనే నాలుగు జిల్లాలు ఉన్నాయి.
అక్టోబర్ 2023లో, హైదరాబాద్‌లో అత్యధిక ఆస్తి రిజిస్ట్రేషన్లు 25 నుంచి 50 లక్షల రూపాయిలు ధర పరిధిలో జరిగాయని తెలుస్తుంది.. మొత్తం రిజిస్ట్రేషన్లలో 50% వాటా ఉంది. 25 లక్షల రూపాయిలు కంటే తక్కువ ధర గల ప్రాపర్టీలు మొత్తం రిజిస్ట్రేషన్‌లో 16% ఉన్నాయి. ఇది అక్టోబర్ 2022లో నమోదైన 22% షేర్ నుండి పడిపోయింది. రూ. ఒక కోటి రూపాయిలు, అంతకంటే ఎక్కువ టిక్కెట్ పరిమాణాలు ఉన్న ఆస్తుల అమ్మకాల రిజిస్ట్రేషన్ల వాటా అక్టోబర్ 2023లో 10% ఎక్కువ. ఇది అక్టోబర్ 2022లో ఉన్న 8%తో పోలిస్తే ఎక్కువ..
Also Read
- Windfall Tax: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు.. ఎవరికి లాభం?
- Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
జిల్లా స్థాయిలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, మేడ్చల్-మల్కాజిగిరి స్థిరంగా 43% గృహ విక్రయాల రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో ఉండగా, రంగారెడ్డి జిల్లా 42% విక్రయాల రిజిస్ట్రేషన్‌తో దగ్గరగా ఉంది. దీనికి విరుద్ధంగా, అక్టోబర్ 2023లో మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా వాటా 14%.. నివేదికల ప్రకారం, అక్టోబర్ 2023లో, లావాదేవీలు జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు 6.8% పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఆస్తుల ధరలు వరుసగా 6% పెరిగాయి.
అక్టోబర్ లో హైదరాబాద్‌లో నివాస విక్రయాలు ప్రధానంగా 1,000-2,000 చదరపు అడుగుల ప్రాపర్టీలో ఉన్నాయి, అయితే ధర రూ. 25 – 50 లక్షలు, అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏదేమైనా గానీ బల్క్ లావాదేవీల కేంద్రీకరణకు మించి గృహ కొనుగోలుదారులు ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేశారు, ఇవి పరిమాణంలో పెద్దవి మరియు మెరుగైన సౌకర్యాలను అందిస్తాయి. ఈ డీల్‌లలో కొన్ని హైదరాబాద్ మరియు రంగారెడ్డి వంటి మార్కెట్లలో జరిగాయి, వీటిలో ఆస్తులు 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. వాటి విలువ రూ. 4.5 కోట్లు అని అధ్యయనం సూచించింది..
తాజావార్తలు
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!