NTV Telugu Site icon

Android: స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ కాకుండా ఉండాలంటే…

ఈ రోజుల్లో స్మార్ట్ వినియోగించే వారి సంఖ్య భారీగా ఉన్న‌ది. యువ‌కులు, చిన్నారుల నుంచి పెద‌వాళ్ల వ‌ర‌కు అంద‌రూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. రోజుకో కొత్త మోడ‌ల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వ‌స్తున్న నేప‌థ్యంలో కొన్ని మోడ‌ళ్లు ఊరికే హ్యాంగ్ అవుతుంటాయి. ఫోన్లు హ్యాంగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ను ఫాలోకావాలో తెలుసుకుందాం.

Read: Electrical Scooter: ఫేషియ‌ల్ టెక్నాల‌జీతో తొలి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌… ఏపీలోనే త‌యారీ…

స్మార్ట్ ఫోన్లో కావోచ్చు, కంప్యూట‌ర్ల‌లో కావొచ్చు… ఇంట‌ర్న‌ల్ స్పేస్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఫోన్ కెపాసిటీ ఎక్కువ‌గా ఉంద‌ని ఎక్కువ డేటాను స్టోరేజ్ చేసుకోకూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. స్టోరేజీ సామ‌ర్థ్యానికి డేటా చేరువైతే ఫోన్ స్పీడ్ మంద‌గిస్తుంది. ఫ‌లితంగా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. అవ‌స‌రం లేని ఫోటోలు, వీడియోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు డిలీట్ చేసి క్లీన్ చేసుకోవాలి. అన‌వ‌స‌రమైన యాప్స్ ఉంటే వెంట‌నే డిలీట్ చేసుకోవాలి. అంతేకాదు, స్మార్ట్ ఫోన్‌లో యానిమేష‌న్, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎనేబుల్ అయినా స్పీడ్ త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా హ్యాంగ్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. యానిమేష‌న్, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ను ట‌ర్న ఆఫ్ చేసుకోవాలి. యాండ్రాయిడ్ వెర్స‌న్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ కాకుండా ఉంటుంది.