SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!
- ఇంట్లో బిడ్డ పుట్టిన తర్వాత ఆర్థిక బాధ్యతలు
- ఇండియాలో పిల్లల ఖర్చు: ₹55-85 లక్షల మధ్య
- ఏ స్కీమ్ బెటర్?
- బలమైన కార్పస్ నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Investment Plans: ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రుల జీవితంలో ఆనందం మొదలవుతుంది. కానీ ఆ ఆనందంతో పాటు భవిష్యత్తు బాధ్యతలు కూడా మెల్లగా పెరుగుతాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే దంపతులు తమ కూతురిని మంచి స్కూల్‌లో చేర్పించారనుకుందాం. మొదట్లో ఫీజు తక్కువగానే అనిపించింది. కానీ ప్రతి ఏడాది ఫీజులు పెరుగుతూనే వచ్చాయి. బుక్స్, యూనిఫామ్, ట్రాన్స్‌పోర్ట్, ట్యూషన్లు లాంటి ఖర్చులు క్రమంగా పెరిగాయి. స్కూల్ తర్వాత కోచింగ్, కాలేజ్, ప్రొఫెషనల్ కోర్సులు కూడా అవసరం అవుతాయని ఆలోచించగానే వారికి ఒక విషయం అర్థమైంది. పిల్లల భవిష్యత్తు కోసం ముందుగానే ఆర్థిక ప్రణాళిక ఉండాలి. అందుకే సేవింగ్స్ మొదలు పెట్టాలి.
55 నుంచి 85లక్షల ఖర్చు:
Also Read
- Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
- Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ఆర్థిక సలహాదారు సిద్ధాంత్ గార్గ్ అంచనా ప్రకారం ఇండియాలో ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు సుమారు 55 లక్షల నుంచి 85 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో చదువు కోసం పెట్టే ఖర్చే ఎక్కువ. ఒక సాధారణ ప్రైవేట్ స్కూల్‌లో చదివించినా కేవలం స్కూలింగ్‌కే 15లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉన్నత విద్య, కోచింగ్, ప్రొఫెషనల్ కోర్సులు కలిపితే మరో 25 లక్షల వరకు అవసరం రావచ్చు. వీటికి తోడు గాడ్జెట్లు, హాబీలు, స్పోర్ట్స్, బర్డ్‌డే వేడుకలు, చిన్న చిన్న ప్రయాణాలు లాంటి జీవనశైలి ఖర్చులు కూడా తడిసి మోపెడవుతాయి.
10th Halltickets : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్స్ వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
ఏ స్కీమ్ బెటర్?
ఈ ఖర్చులన్నింటిని ఒక్కసారిగా భరించడం కష్టమే. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచే సేవింగ్స్ ప్రారంభిస్తే భవిష్యత్తులో ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి నెల 5 వేల రూపాయలు SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే సుమారు 12శాతం వార్షిక రాబడి ఆధారంగా 18సంవత్సరాల తర్వాత దాదాపు 50లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అదే మొత్తాన్ని PPFలో ప్రతి సంవత్సరం 60 వేలుగా 15సంవత్సరాలు పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటు ఆధారంగా సుమారు 16 నుంచి 17 లక్షల వరకు పెరగవచ్చు. కూతురు కోసం సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి 60వేల రూపాయల చొప్పున 15 సంవత్సరాలు జమ చేస్తే ప్రస్తుత 8.2శాతం వడ్డీ రేటుతో మెచ్యురిటీ సమయానికి దాదాపు 25 లక్షల వరకు సేవ్ చేయవచ్చు.
బలమైన కార్పస్ ఉండాల్సిందే:
ఏ పథకం ఎంచుకున్నా ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్స్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించడం అత్యంత ముఖ్యమైన నిర్ణయం. చిన్న మొత్తాలతో ప్రారంభించిన పెట్టుబడులు కాలక్రమంలో పెద్ద ఆర్థిక భద్రతగా మారుతాయి. అందుకే SIP లాంటి వృద్ధి అవకాశాలు ఉన్న పెట్టుబడులు, PPF లాంటి భద్రమైన పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి ప్రత్యేక పథకాలను కలిపి ఉపయోగిస్తే పిల్లల చదువు, భవిష్యత్తు కోసం బలమైన కార్పస్ నిర్మించుకోవచ్చు.
Free Stay in Dubai : దుబాయ్‌లో చిక్కుకున్నారా.? ఈ హోటల్స్‌లో ఉచితంగా బస చేయండి.!
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!