Site icon NTV Telugu

House sales: హైదరాబాద్‌లో జోరందుకోనున్న ఇళ్ల అమ్మకాలు.. మరో 5 నగరాల్లో ఇదే పరిస్థితి

Crisil Reoprt

Crisil Reoprt

House sales: హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఈ ఏడాది నివాస గృహాల విక్రయాల్లో 8-10 శాతం వృద్ధి నమోదు అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో దేశంలోని ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు పెరుగుతాయని తెలిపింది. వసూల్లు బాగుండటంతో పాటు రుణభారం తక్కువగా ఉండటంతో డెవలపర్ల క్రిడెట్ ప్రొఫైల్ కూడా బలోపేతం అవుతాయని నివేదిక తెలిపింది.

Read Also: Chennai: స్పీడ్ దాటిందో.. ఆటోమెటిక్‌గా చలాన్.. చెన్నైలో తొలిసారిగా..

మిడ్, ప్రీమియం, లగ్జరీ విభాగాల్లో బలమైన అమ్మకాలు చోటు చేసుకోనున్నాయని, ఇది డెవలపర్ల క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. మధ్యకాలికంగా కూడా ఈ థోరణి నిలదొక్కుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇళ్ల అమ్మకాల్లో 35 శాతం వాటా ఉన్న 11 పెద్ద, 76 చిన్న/మధ్యతరహా డెవలపర్లతో సర్వే అనంతరం ఈ నివేదిక రూపొందించింది. హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ, పూణే, కల‌కతా, బెంగళూర్ నగరాలను ఇందుకు పరిగణలోకి తీసుకున్నారు.

ప్రీమియం ఇళ్లకే ప్రజల మొగ్గు:
పెద్ద, ప్రీమియం ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉందని, ఇలాంటి ఇల్ల విక్రయాల ద్వారా ఈ డెవలపర్ల వద్ద క్రెడిట్ ప్రొఫైల్ పెరగడమే ఇందుకు కారణమని క్రిసిట్ పేర్కొంది. ఇదే విధంగా బ్యాంకు రుణాలు తేలిగ్గా అందుబాటులో ఉండటం కూడా ఇందుకు కారణం అని క్రిసిల్ పేర్కొంది. వినియోగదారుల ప్రాధాన్యత, విస్వనీయత కలిగిన ప్రతిష్టాత్మకైమన బ్రాండ్స్ కి మారిందని తెలిపింది. కంపెనీలు వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తూ ఉండటం కూడా పెద్ద ఇళ్లకు గిరాకీ పెరగడానికి కారణమని క్రిసిల్ తెలిపింది.

Exit mobile version