Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా ? ఈ పొరపాటును మాత్రం అస్సలు చేయకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Loan : ఇల్లు కొనడం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి డ్రీం. కానీ ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది హోమ్ లోన్స్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే బ్యాంకులు కూడా అంత ఈజీగా లోన్స్ ఇవ్వవు. భారీ మొత్తంలో లోన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి… కస్టమర్ ఆదాయం ఆధారంగా పెద్ద మొత్తంలో ఇలాంటి రుణాన్ని అందిస్తాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. అంత పెద్ద లోన్ తీసుకోవడం కరెక్టేనా ? తీసుకున్నాక ఎంత ఈఎంఐ పెట్టుకోవాలి ?. ఎందుకంటే ఇల్లు కొనే ముందు ప్రతి నెలా ఎంత EMIని సౌకర్యవంతంగా చెల్లించగలరో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఒక తప్పుడు నిర్ణయం మీ ఆర్థిక పరిస్థితిపై దీర్ఘకాలిక ఒత్తిడిని కలిగించవచ్చు.
హోమ్ లోన్ ఒక దీర్ఘకాలిక బాధ్యత
గృహ రుణాలు సాధారణంగా 15 నుండి 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి తీసుకుంటారు. అంటే చాలా సంవత్సరాల పాటు ప్రతి నెలా మీ జీతంలో కొంత భాగం EMI రూపంలో తీసివేయబడుతుంది. అందువల్ల కేవలం బ్యాంకు అర్హత ఆధారంగా మీ లోన్ ఈఎంఐని నిర్ణయించుకోవడం కాదు, మీ అవసరాలను, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.
Also Read
- Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
- Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
EMI భారం ఎంత ఉండాలి ?
ఆర్థిక నిపుణుల ప్రకారం, హోమ్ లోన్ ఈఎంఐలు మీ నెలవారీ ఆదాయంలో 30 శాతానికి మించకూడదు. ఉదాహరణకు ఒక నెల జీతం లక్ష అయితే, మీ ఈఎంఐ సుమారు రూ.. 30,000 ఉండాలి. దీనివల్ల మీ ఇతర అవసరమైన ఖర్చులపై ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటారు.
ఈ ఖర్చులను మరచిపోవద్దు
ఇంటి ఈఎంఐలు కాకుండా, కుటుంబానికి ఇంకా అనేక ఇతర తప్పనిసరి ఖర్చులు ఉంటాయి. వీటిలో పిల్లల ఫీజులు, ఆరోగ్య బీమా, వైద్య ఖర్చులు, వాహన ఈఎంఐలు, రోజువారీ ఇంటి ఖర్చులు, పెట్టుబడులు, పొదుపులు వంటివి ఉన్నాయి. మీ ఆదాయంలో అధిక భాగం కేవలం గృహ రుణ వాయిదాలకే ఖర్చవుతుంటే, ఈ అవసరాలను తీర్చడం కష్టమవుతుంది.
పెద్ద ఇల్లా లేక పిల్లల చదువులా ?
పిల్లల భవిష్యత్తుకు వారి చదువే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అని నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో ఉన్నత విద్య ఖర్చు వేగంగా పెరుగుతోంది. అందువల్ల, కేవలం పెద్ద ఇల్లు కొనడం కోసం మీ ఆర్థిక స్థోమతకు మించి రుణం తీసుకోవడం తెలివైన పని కాదని చెప్పవచ్చు. అవసరమైతే చిన్న ఇల్లు తీసుకోవచ్చు, కానీ పిల్లల చదువు, కుటుంబ భద్రత విషయంలో రాజీ పడకూడదు.
హోమ్ లోన్ తీసుకునే ముందు ఈ సూత్రాన్ని పాటించండి
గృహ రుణం కోసం దరఖాస్తు చేసే ముందు, మీ మొత్తం ఆదాయం, నెలవారీ ఖర్చులు, పొదుపు, భవిష్యత్ ఆర్థిక అవసరాలను అంచనా వేసుకోండి. మీ EMI మీ ఆదాయంలో సుమారు 30% ఉంటే, మీరు ఆర్థికంగా మరింత సురక్షితంగా ఉంటారు. బ్యాంకు అందించే లోన్ మొత్తం ఎంత అన్నది ముఖ్యం కాదు; మీరు ఒత్తిడి లేకుండా చెల్లించగలిగే EMI ఎంత అనేది మాత్రమే ముఖ్యం అని గుర్తుంచుకోండి.
- Tags
- home loan
- monthly income
తాజావార్తలు
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!