Heritage Foods: నేషనల్ బ్రాండ్ అవ్వాలని హెరిటేజ్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్‌ని నేషనల్ బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలని కంపెనీ యాజమాన్యం భవిష్యత్ ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రొడక్టుల మ్యానిఫ్యాక్షరింగ్ కెపాసిటీలను పెంచుకోవాలని నిర్ణయించింది. పాల సేకరణ కోసం పల్లె స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు, 11 రాష్ట్రాల్లో 121 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, ఒకటీ పాయింట్ మూడు లక్షల రిటైల్ ఔట్లెట్లు, 859 పార్లర్లు ఉన్నాయి.
also read: High Court: అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు.. కారణం ఇదే..!!
Also Read
- Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
- Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
- Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
- Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
నిత్యం 26 లక్షలకు పైగా లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తోంది. సేల్స్ నెట్‌వర్క్‌ను కొత్త ప్రాంతాల్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెల్త్, ఫ్రెష్ ప్రొడక్టులు అనగానే జాతీయ స్థాయిలో సైతం తమ పేరే గుర్తొచ్చే స్థాయికి ఎదగాలని హెరిటేజ్ సంస్థ అనుకుంటోంది. విలేజ్ లెవల్లో బల్క్ కూలర్లను ఏర్పాటుచేయనుంది. చిల్లింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా పాల సేకరణను పెంచనుంది. టోటల్ రెవెన్యూలో వ్యాల్యూ యాడెడ్ ప్రొడక్టుల(వీఏపీ) ఇన్కమ్ని పెంచుకోవటం కోసం మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది.
గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో వీఏపీ ఆదాయం 25.7 శాతం మాత్రమే కాగా కన్నా ఈసారి అది 27.03కి పెరిగింది. రివ్యూ చేస్తున్న క్వార్టర్లో వీఏపీ రెవెన్యూ 28.86 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఫలితంగా రూ.169.6 కోట్ల నుంచి రూ.218.6 కోట్లకు వృద్ధి సాధించింది. పెరుగు అమ్మకాలు 16.69 ఎక్కువ జరిగాయి. రోజువారీ విక్రయాలు 326 టన్నులకు చేరాయి.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేనట్లే.. అండగా నిలుస్తున్న బీజేపీ..
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
-
Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
-
Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
-
Chennai Love Story: ప్రీమియర్స్ తో 3 కోట్లు కొల్లగొట్టిన చెన్నై లవ్ స్టోరీ
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!