యూపీఐ గురించి ఈ రోజుల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరోక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది. దీంతో అందరూ ఈ డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు. యూపీఐ యూజర్స్‌కి ఓ బ్యాంకు చేదు వార్త చెప్పింది. రెండ్రోజులు యూపీఐ సేవలు పనిచేయవని తెలిపింది.
READ MORE: MP Purandeswari: 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్.. ఎంపీ పురంధేశ్వరి ఆస్ట్రేలియా పయనం
దేశంలోని అతిపెద్ద బ్యాంక్‌లలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీలో మీకు ఖాతా ఉంటే.. రాబోయే రెండు రోజులు మీరు యూపీఐ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు రోజుల పాటు యూపీఐ సేవ పని చేయదు. ఈ సమాచారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడింది. ఈ బ్యాంకు ఖాతాదారులు నవంబర్ 5, 23 తేదీల్లో సిస్టమ్ నిర్వహణ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని తెలిపింది. బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ సేవలు నవంబర్ 5న 2 గంటలు, నవంబర్ 23న 3 గంటల పాటు అందుబాటులో ఉండవు. బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి.. అవసరమైన సిస్టమ్ నిర్వహణను నిర్వహిస్తున్నామని బ్యాంక్ పేర్కొంది.
READ MORE: Varun Tej: లావణ్య ప్రస్తావన.. రిపోర్టర్ కి వరుణ్ తేజ కౌంటర్