Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Hcl Founder Shiv Nadar Gifts 47 Of His Stake To Daughter Roshni Nadar

HCL: కూతురు రోష్ని నాడర్‌కి 47% తన వాటాని గిఫ్ట్‌గా ఇచ్చిన శివ్ నాడార్..

Published Date :March 9, 2025 , 5:45 pm
By Venu Goapl Reddy
  • HCL శివ్ నాడార్ కీలక నిర్ణయం..
  • తన వాటాలో 47 శాతం కూతురు రోష్ని నాడార్‌కి బదలాయింపు..
  • వారసత్వ ప్రణాళికలో భాగంగా నిర్ణయం..
HCL: కూతురు రోష్ని నాడర్‌కి 47% తన వాటాని గిఫ్ట్‌గా ఇచ్చిన శివ్ నాడార్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

HCL: HCL వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన వాటాలో 47 శాతాన్ని కూతురు రోష్ని నాడార్ మల్హోత్రాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యూహాత్మక వారసత్వ ప్రణాళికలో భాగంగా, HCL గ్రూప్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, గ్రూప్ ప్రమోటర్ సంస్థలు అయిన HCL కార్ప్, వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్ (వామ ఢిల్లీ)లో తన వాటాలో 47% తన కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రాకు బహుమతిగా ఇచ్చారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితా 2025 ప్రకారం.. శివ్ నాడార్ నికర విలువ $34.4 బిలియన్లుగా ఉంది, ఆయనను ప్రపంచంలోని 52వ ధనవంతుడిగా పేర్కొంది.

ఈ బదిలీతో $12 బిలియన్ల టెక్నాలజీ కంపెనీకి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు రోష్ని నాడార్ బాధ్యత వహిస్తారు. ఆమె రెండు సంస్థల నియంత్రణను సొంతం చేసుకుంటుంది. వామా ఢిల్లీ, HCL కార్ప్‌లో మెజారిటీ వాటాదారు అవుతుంది. ఈ నిర్ణయంతో ఆమె వామా ఢిల్లీలో 44.17% వాటాతో, HCL కార్ప్ 0.17% వాటాతో ముడిపడి ఉన్న ఓటింగ్ హక్కులపై కూడా నియంత్రణ పొందుతారు. HCL ఇన్ఫోసిస్టమ్స్‌లో వామా ఢిల్లీకి ఉన్న 12.94% వాటాతో పాటు HCL కార్ప్‌కు ఉన్న 49.94% వాటాపై ఓటు హక్కును కలిగి ఉంటారు.

Also Read

  • Stock Market: మార్కెట్‌లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!

Read Also: TG GOVT: నేతన్నలకు తీపికబురు.. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం జీఓ

వారసత్వాన్ని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించి ప్రైవేట్ కుటుంబ ఏర్పాటు ప్రకారం గిఫ్ట్ డీడ్‌లు అమలు చేశారు. ఇది శివ్ నాడర్ కుటుంబం(ప్రమోటర్ కుటుంబం) యాజమాన్యం, నియంత్రణను కొనసాగిస్తుంది. కంపెనీకి కావాల్సిన స్థిరత్వాన్ని అందిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా శివ్ నాడార్, రోష్ని నాడార్ మల్హోత్రాలు వామా ఢిల్లీ, హెచ్‌సీఎల్ కార్ప్‌ రెండింటిలో వరసగా 51 శాతం, 10.33 శాతం వాటాను కలిగి ఉంటారు. ‘‘ఈ గిఫ్ట్ డీడ్‌ల ద్వారా, శివ్ నాడార్ వామా ఢిల్లీ మరియు కంపెనీ ప్రమోటర్/ప్రమోటర్ గ్రూప్ అయిన HCL కార్ప్ రెండింటిలోనూ 47% వాటాను తన కుమార్తె శ్రీమతి రోష్ని నాడార్ మల్హోత్రాకు బదిలీ చేయడానికి అంగీకరించారు. ఈ బదిలీ తర్వాత, ఆమె నియంత్రణను పొంది వామా ఢిల్లీ మరియు HCL కార్ప్‌లో మెజారిటీ వాటాదారుగా మారుతుంది’’ అని కంపెనీ వెల్లడించింది.

శివ్ నాడార్ జూలై 2020లో తన కుమార్తెకు పగ్గాలు అప్పగించారు. దీంతో ఆమె భారతీయ ఐటీ కంపెనీకి మొదటి మహిళా చైర్‌పర్సన్‌గా మారారు. శివ్ నాడార్ జూలై 2021లో HCL టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశారు, ఆ తర్వాత HCL టెక్నాలజీస్ CEO అయిన సి విజయకుమార్ ఐదు సంవత్సరాల కాలానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

రోష్ని నాడార్ మల్హోత్రా వివరాలు:

రోష్ని నాడార్ మల్హోత్రా HCLTech చైర్‌పర్సన్ , దాని CSR బోర్డు కమిటీ చైర్‌పర్సన్.ఆమె శివ్ నాడార్ ఫౌండేషన్ కు ట్రస్టీగా కూడా ఉన్నారు. ఈ ట్రస్ట్ భారతదేశంలోని అగ్రశ్రేణి కాలేజీలు, పాఠశాలల్ని స్థాపించింది. HCLలో చేరడానికి ముందు, రోష్ని నాడార్ న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎంబీఏ పట్టా పొందారు. ఆమె నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • HCL
  • HCL founder
  • HCL succession
  • Roshni Nadar Malhotra
  • Shiv Nadar

తాజావార్తలు

  • Bengal Election: బెంగాల్‌లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!

  • Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!

  • NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్

  • Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions