Site icon NTV Telugu

Harsh Goenka: T20లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడా?.. పాక్‌ చమురుపై ట్రంప్పై గొయెంకా సెటైర్లు

Harsh

Harsh

Harsh Goenka: భారత్‌పై 25 శాతం టారీఫ్స్‌తో పాటు పెనాల్టీ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అంతటితో ఆగకుండా, పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు, భారత్‌కూ పాకిస్థాన్ చమురును విక్రయించే పరిస్థితి వస్తుందని వెరైటీ కామెంట్లు చేయడంపై ప్రముఖ వ్యాపారవేత్త హార్ష్ గొయెంకా స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడి తీరును తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు ‘లగాన్’ సినిమాలో మాత్రమే సాధ్యం అవుతాయని సెటైర్లు వేశారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఇక, డొనాల్డ్ ట్రంప్‌ పోస్ట్‌ను ‘ఎక్స్‌’లో షేర్‌ చేసిన హర్ష్ గొయెంకా, భారత్‌కు పాకిస్థాన్ చమురును విక్రయిస్తారని చెప్పడమంటే టీ20 మ్యాచ్‌లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని చెప్పడమేనని ఎద్దేవా చేశారు. సాంకేతిక అంశాలను పక్కనబెడితే, వాస్తవ రూపంలో కూడా అది అసాధ్యమే అని ఆయన అన్నారు. ఇలాంటివి నిజ జీవితంలో కంటే ‘లగాన్’ సినిమాలో జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: US: భారత్ కారణంగానే రష్యా రెచ్చిపోతుంది.. మార్కో రూబియో విమర్శలు

అయితే, పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ నిన్న (జూలై 31న) ప్రకటించారు. దీని వల్ల దక్షిణాసియాలో అతిపెద్ద చమురు నిల్వ దేశంతో కలిసి పని చేయబోతున్నామని తెలిపారు. “ఏదో ఒక రోజు భారత్‌కూ పాకిస్థాన్ క్రూడ్ ఆయిల్ విక్రయించే రోజు రావొచ్చు” అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం పాకిస్థాన్ పశ్చిమాసియా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది.

Exit mobile version