పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ ప్యానెల్‌లోని చాలా మంది సభ్యులు సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేలా పన్నులను తగ్గించడాన్ని సమర్థించారు. జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటుపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందం శనివారం సమావేశమైంది. ఇందులో సీనియర్ సిటిజన్లు జీవిత బీమా, ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియం పన్ను నుండి మినహాయించే అవకాశం ఉంది. అంతే కాకుండా.. టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు రూ. 5 లక్షల వరకు కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని నిర్ణయించారు. ఈ విషయంలో మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి తెలిపారు.
Read Also: Wayanad: వయనాడ్‌లో ప్రియాంక వర్సెస్ నవ్య హరిదాస్.. పేరు ప్రకటించిన బీజేపీ
అయితే ఈ విషయంలో తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. ప్రస్తుతం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా కవరేజీకి చెల్లించే ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధింపు కొనసాగుతుంది. ప్రస్తుతం, టర్మ్ పాలసీలు, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు చెల్లించే జీవిత బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అయితే దీన్ని తొలగించాలని గతకొన్ని నెలలుగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్నును నిర్ణయించేందుకు 13 మంది సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్‌గా సామ్రాట్ చౌదరిని నియమించారు. ఇందులో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, మేఘాలయ, పంజాబ్, తమిళనాడు మరియు తెలంగాణ మంత్రులు ఉన్నారు. అక్టోబర్ నెలాఖరులోగా తన నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
Read Also: Love Reddy: “లవ్ రెడ్డి” గెలిచాడు, ఇండస్ట్రీ సపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం!