Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Government Is Set To Become The Largest Shareholder Of Vodafone Idea

సర్కార్‌ చేతిలోకి వొడాఫోన్‌-ఐడియా..!

Published Date :January 11, 2022 , 1:17 pm
By Sudhakar Ravula
సర్కార్‌ చేతిలోకి వొడాఫోన్‌-ఐడియా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత దేశంలో మూడో అతి పెద్ద టెలికం సంస్థగా పేరు పొందిన వొడాఫోన్‌ – ఐడియా లిమిటెడ్‌లో మెజార్టీ వాటాలు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయాయి.. దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.. అయితే, ఈ పరిణామాల తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో వొడాఫోన్‌ ఐడియా షేర్లు భారీగా పడిపోయాయి.. అయితే, కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా సర్కార్‌ చేతిలోకి వెళ్లింది.. టెలికం మార్కెట్‌లో పోటీ కారణంగా.. కస్టమర్లను భారీగా కోల్పోతున్న తరుణం, పెద్దగా లాభాలు లేని పరిస్థితులు ఉండడంతో ఈ చర్య తప్పడం లేదంటూ ఆ కంపెనీ సమర్థించుకుంది.. సోమవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం లభించింది.. ఇప్పటి వరకు యూకేకు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ 28.5 శాతం వాటాలు కలిగి ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్‌కు 17.8 శాతం వాటా ఉంది… తాజా నిర్ణయంతో భారత ప్రభుత్వం వాటా 36 శాతానికి పెరిగింది..

Read Also: జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్​వెబ్‌సైట్‌ ప్రారంభం.. 3 కేటగిరీల్లో స్థలాల పంపిణీ

వాయిదా వేసిన స్పెక్ట్రమ్‌పై వడ్డీని మరియు సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిలను ఈక్విటీగా మార్చాలని నిర్ణయించుకున్నందున వొడాఫోన్‌ ఐడియాలో అతిపెద్ద వాటాదారుగా అవతరించింది ప్రభుత్వం.. గత అక్టోబర్‌లో కేంద్రం తన టెలికాం సంస్కరణల ప్యాకేజీలో టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్ మరియు AGR బకాయిలపై నాలుగు సంవత్సరాల మారటోరియం మంజూరు చేసింది. వాయిదా వేసిన అప్పులపై వడ్డీని ఈక్విటీగా మార్చుకునే అవకాశం కూడా కంపెనీలకు ఇవ్వబడింది. అయితే, ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా మారవచ్చు, కంపెనీని నడపడంలో పాలుపంచుకోకపోవచ్చు అని గతంలోనే వొడాఫోన్‌ ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థగా మారుస్తుందని పేర్కొనడం సరికాదన్న ఆయన.. మేం కంపెనీని సమర్ధవంతంగా మరియు పోటీతత్వంతో నడపాలని ప్రభుత్వం కోరుకుంటోంది.. ప్రభుత్వంతో నేను జరిపిన సంభాషణలన్నింటిలోనూ, భారతదేశంలో టెలికాం కంపెనీలను కొనుగోలు చేయడం మరియు నిర్వహించడం పట్ల తమకు ఆసక్తి లేదని స్పష్టంగా ప్రభుత్వం చెప్పిందని టక్కర్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Moinabad Farmhouse Drugs Case: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు బెయిల్..

  • Suyodhana Teaser: సస్పెన్స్ మిస్టరీతో ‘సుయోధన’ టీజర్

  • Tirumala: తిరుమలలో మండువేసవిలో మంచు..

  • Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!

  • Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..

ట్రెండింగ్‌

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
advertisement will close in 5 seconds ×
ads