Site icon NTV Telugu

ఎయిర్‌టెల్‌లో గూగుల్ భారీ పెట్టుబడులు

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో గూగుల్ భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనుంది. రానున్న ఐదేళ్ల కాలంలో ఎయిర్‌టెల్‌లో గూగుల్ సంస్థ రూ.7,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం యాజమాన్య హక్కులను కొనుగోలు చేసేందుకు గూగుల్ ఆసక్తి చూపిస్తోంది. మరో 300 మిలియన్ డాలర్ల మేర ఎయిర్ టెల్‌తో వాణిజ్య లావాదేవీలను గూగుల్ కుదుర్చుకోనుంది.

Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్

కాగా 5G నెట్‌వర్క్, తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు అందించడం వంటి అంశాల్లో ఎయిర్‌టెల్‌తో కలిసి గూగుల్ కలిసి పనిచేయనుంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వచ్చే అవకాశముంది. ఒప్పందంలో భాగంగా గూగుల్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్‌సీ 7,11,76,839 భారతీ ఎయిర్ టెల్ షేర్లను కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరుకు రూ.734 వెచ్చిస్తుంది. ఇందుకు రూ.5,224 కోట్లు అవసరం అవుతాయి. గతంలో దేశంలోనే అగ్రగామి టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టిన గూగుల్.. ఇప్పుడు రెండో పెద్ద సంస్థ ఎయిర్‌టెల్‌లోనూ పెట్టుబడులు పెట్టనుండటం గమనార్హం. 2020లో జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టిన గూగుల్.. 7.73 శాతం వాటాను దక్కించుకుంది.

Exit mobile version